వేలూరులో జల్లికట్టు
రెండేళ్లుగా వేలూరు జిల్లాలో జల్లికట్టు నిర్వహణకు ప్రభుత్వం అనుమతినివ్వలేదు. అయితే ఈసారి అనుమతి ఇవ్వడంతో పెన్నాతూర్ గ్రామంలో ఆదివారం జల్లికట్టు నిర్వహించారు. ఇందులో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
వేలూరు జిల్లాలో ప్రభుత్వ అనుమతితో ఆది వారం మధ్యాహ్నం పెన్నాతూర్ గ్రామంలో జల్లికట్టు నిర్వహించారు. ఈ జల్లికట్టును తిలకించేందుకు వేలాది మంది తరలివచ్చారు. యువకులు కూడా ఉత్సాహంగా ఈ జల్లికట్టులో పాల్గొన్నారు. రెండు సంవత్సరాలుగా జిల్లాలో జల్లికట్టుకు నిబంధనల పేరుతో నిలిపి వేశారు. దీంతో ఈ సారి ప్రభుత్వ అనుమతితోనే ఆదివారం దీన్ని నిర్వహించారు. రెండేళ్లుగా నిరుత్సాహంగా ఉన్న యువకులు ఆదివారం కోలాహలంగా జల్లికట్టును జరుపుకున్నారు.
ఇందుకోసం ఏర్పాటు చేసి కంచెను కూడా లెక్క చేయడకుండా యువకులు ఎద్దులను ఉరకలెత్తించారు. ఎద్దులు కూడా పౌరుషంతో లక్ష్యం వైపు దూసుకెళ్లారుు. వాటి ని అడ్డుకునేందుకు యత్నించిన సుమారు 20 మంది వరకు గాయాలపాలయ్యూరు. అయినా కుర్రకారులో మాత్రం ఉత్సాహం తగ్గలేదు.
ఆ గాయూలను కూడా లెక్క చేయకుండా మరింత ఉత్సాహంగా ఈ క్రీడలో పాల్గొనడం విశేషం. అరుుతే యువకులు నెట్టుకుంటూ ఎద్దులు వెళ్లే దారిలోకి వచ్చేశారు. దీంతో వారిని అదు పు చేసేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తరువాత యథాప్రకారం జల్లికట్టును సాయంత్రం వరకు నిర్వహించారు.