పెన్షనర్ల మార్గదర్శకాలపై వివరణ
జగిత్యాల అర్బన్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మహా గణకుల కార్యాలయం ఇటీవల జారీ చేసిన పెన్షనర్ల మార్గదర్శకాలు ఏపీ ప్రభుత్వ రిటైర్డ్ పెన్షనర్లకే వర్తిస్తాయని, తెలంగాణ ప్రభుత్వ రిటైర్డ్ పెన్షనర్లకు వర్తించవని వివరణలో స్పష్టం చేసినట్లు పెన్షనర్స్ అసోసియేషన్ జగిత్యాల డివిజన్ అధ్యక్షుడు హరి అశోక్‌కుమార్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014 డిసెంబర్ 15న జారీ చేసిన జీవో 87 మేరకు 1998 కంటే ముందు రిటైర్డ్ అయిన ఆంధ్ర ప్రాంత పెన్షనర్ల పింఛన్లను సవరించినట్లు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత ఈ ప్రాంత పింఛనర్ల పెన్షన్లు సవరించబడతాయని మహా గణకుల కార్యాలయ అధికారులు స్పష్టం చేసినట్లు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.