బాబు గూబ గుయ్‌మనేలా శంఖారావం
ఫ్యాను గాలికి టీడీపీ కొట్టుకుపోతుంది..
ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి
తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్: తిరుపతి ఆధ్మాత్మిక పుణ్యక్షేత్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్రెడ్డి పూరించనున్న ఎన్నికల శంఖారావం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గూబ గుయ్ మనేలా ఉంటుందని తిరుపతి ఎమ్మెల్యే భూమ న కరుణాకరరెడ్డి అన్నారు. తిరుపతి పరిధిలోని కొర్లగుంట, గాంధీరోడ్డు ప్రాంతాల్లో బుధవారం పార్టీ నాయకు డు జ్యోతిప్రకాష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రజాబాట నిర్వహించారు.
ఈ సందర్భంగా కరుణాకరరెడ్డి మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలుగా కిరణ్, చం ద్రబాబు కుమ్మక్కు రాజకీయాలతో అధిక భారాలు మోపి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారన్నారు. దీం తో విసిగిపోయిన ప్రజలు జగనన్న పాలన కోసం ఎదురుచూస్తున్నారన్నా రు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాను గాలికి టీడీపీ అడ్రస్ లేకుండా కొట్టుకుపోతుందన్నారు. సోనియాగాంధీకి తొత్తులుగా వ్యవహరించి తెలుగుజాతిని ముక్కలు చేసిన దుర్మార్గులు కిరణ్, చంద్రబాబు అని మండిపడ్డారు.
రాష్ట్ర విభజన ద్రోహులైన కిరణ్, చంద్రబాబుకు ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. ఆరు నెలల పాటు రాష్ట్ర సమైక్యత కోసం అలుపెరగని ఉద్యమ, పోరాటాలు చేసింది ఒక్క వైఎస్ఆర్సీపీ మాత్రమేనని గుర్తు చేశారు. తాను గెలుపొందిన రెండేళ్ల కాలంలో నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశానని ఎమ్మెల్యే తెలిపారు. రాబోయే ఎన్నిక ల్లో వైఎస్ఆర్ సీపీని గెలిపించాలని విజ్ఞ ప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు వెలగపల్లి వరప్రసాదరావు, పార్టీ నాయకులు పుల్లయ్య, కేతం జయచంద్రారెడ్డి, పి. అమరనాథరెడ్డి, టి. రాజేం ద్ర, బాలమునిరెడ్డి, తాలూరి ప్రసాద్, రామకృష్ణయ్య, చెలికం కుసుమ, గీత, శారద, దుర్గ, శాంతారెడ్డి, బోయళ్ల రాజేంద్రరెడ్డి పాల్గొన్నారు.