'ఫించన్ దారులు 15లోగా నమోదు చేసుకోవాలి'
హైదరాబాద్: ఫాస్ట్ పథకం ద్వారా లబ్బి పొందాలనుకునే విద్యార్ధులు అక్టోబర్ నెలాఖరులోగా ఎమ్మార్వో నుంచి సర్టిఫికెట్లు తీసుకోవాలని మంగళవారం నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. పెరిగిన ఫించన్లు నవంబర్ నుంచి అమల్లోకి తీసుకురావాలని కేసీఆర్ సూచించారు. ఫించన్ లబ్దిదారులు, వృద్దులు, వికలాంగులు, వితంతువులు ఈనెల 15లోగా వీఆర్వో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
పేదలకు రేషన్ కార్టుల స్థానంలో ఆహార భద్రతా కార్టులు, ప్రభుత్వ ఉద్యోగులు, 5 ఎకరాలకు పైగా భూమి ఉన్నవారు, వ్యాపారస్థులను, పేదల జాబితా నుంచి తొలగించాలని తెలంగాణప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని పథకాల లబ్దిదారులు ఎంపిక ఎమ్మార్వోల పర్యవేక్షణలో జరుగుతుందని కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్ వెల్లడించారు.