పెంచుతారనుకుంటే కుదించారు
మాడుగుల రూరల్ : పింఛను మొత్తాన్ని పెంచుతామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు లబ్ధిదారులను కుదించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాజిక భద్రత పథకం కింద ప్రతినెలా వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు అందించే పింఛన్లలో కోత విధించడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల నుం చి వృద్ధులు, వితంతువులకు రూ. 200 నుంచి రూ.వెయ్యి, 40 నుంచి 80 శాతం వికలాంగత్వం ఉన్నవారికి రూ.వెయ్యి, 80 నుంచి 100 శాతం ఉన్నవారికి రూ.1500 చొప్పున అందిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న పింఛన్లలో కోత విధించింది.
ఈ మేరకు పోస్టాఫీస్‌లకు అందిన స మాచారం ప్రకారం మండలంలో 9076 మంది లబ్ధిదారులలో 1150 మందిని జాబితా నుంచి తప్పిం చారు. గ్రామస్థాయిలో సర్పంచ్ అధ్యక్షుడిగా, కార్యదర్శి కన్వీనర్‌గా ఉన్న పింఛను అర్హత సర్వే కమిటీలు ఈ నెల 2వ వారంలో నివేదికలు మండల కమిటీకి అందజేశాయి. మండలంలో 18 మంది పింఛన్లు తొలగించడానికి మండల కమిటీ సిఫార్సు చేసింది. అధిక సంఖ్యలో లబ్ధిదారులకు గత నెల పింఛన్ సొ మ్ము వారి ఖాతాల్లో వేయలేదు. పింఛన్ల కోత విషయంలో తమకు ఏమీ తెలియదని అధికారులు స్ప ష్టం చేస్తున్నారు. ఇంత మొత్తంలో కోత విధించడం తమకు తెలియదని ఎంపీడీఓ శచీదేవి చెప్పారు.