గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
ఖమ్మం క్రైం : నగరంలోని వేణుగోపాల్నగర్ సమీపంలోని సాగర్ కాల్వలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. టూటౌన్ పోలీసుల క«థనం ప్రకారం... పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం పెంటపాడుకు చెందిన అల్లాడి రాజారమేష్(25) రోడ్ల మర్మతుల పనులకు ఖమ్మం వచ్చాడు. మంగళవారం సాయంత్రం స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లాడు. స్నానం చేస్తుండగా అకస్మాత్తుగా గల్లంతయ్యాడు. వెంటనే అతడి సోదరుడు, స్నేహితులు ఎంత వెతికినా రాజారమేష్ ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో టూటౌన్ పోలీస్స్టేçÙన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం ఉదయం రాజారమేష్ గల్లంతయిన ప్రాంతానికి కొద్దిదూరంలో అతడి మృతదేహం కనిపించింది. పోలీసులు పంచనామా నిర్వహించి బంధువులకు మృతదేహం అప్పగించారు.