మెరుగుపడుతున్న కేశవరెడ్డి ఆరోగ్యం
నిజామాబాద్: ప్రముఖ తెలుగు నవలారచయిత డాక్టర్ పెనుమూరి కేశవరెడ్డి గత సోమవారం గుండెనొప్పితో అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 66 ఏళ్ల కేశవరెడ్డి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని ఆయనకు వైద్య సేవలు అందిస్తున్న కార్డియాలజిస్ట్ డాక్టర్ రవీంద్రనాథ్సూరి తెలిపారు.
నాలుగు మాసాల క్రితం కేశవరెడ్డికి లింక్ఫోమా కేన్సర్ వ్యాధి నిర్ధారణ అయ్యింది. కేశవరెడ్డి తెలు గు సాహితీరంగంలో ప్రముఖ నవలా రచయిగా పేరు పొందారు. ఆయన రచించిన ‘అతడు అడవిని జయిం చాడు’ నవలను నేషనల్ బుక్ ట్రస్ట్ వారు 14 భారతీయ భాషల్లోకి అనువదించారు.
రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల్లో ఆయన రచనలపై ఎంఫిల్, పీహెచ్డీ చేసిన పరిశోధకులు ఉన్నారు. పలు సదస్సులు, వేదికలపై ఆయ న రాసిన రచనలపై సమావేశాలు నిర్వహించారు. ప్రము ఖ రచయితగా, వైద్యునిగా పేరు ప్రఖ్యాతులు గడించారు. మూడు దశాబ్దాలుగా డిచ్పల్లి వద్ద కుష్టు రోగుల ఆస్పత్రిలో స్కిన్ స్పెషలిస్టుగా సేవలందించారు.