వరంగల్లో కలెక్టర్ ఆకస్మిక పర్యటన
వరంగల్: వరంగల్ జిల్లా కలెక్టర్ వి. కరుణ మంగళవారం నగరంలో ఆకస్మికంగా పర్యటన చేపట్టారు. అండర్ రైల్వే బ్రిడ్జి సమీపంలోని పెరిక బాలికల వసతి గృహాన్ని ఆమె ఈరోజు ఉదయం తనిఖీ చేశారు. వసతి గృహంలోని సౌకర్యాలపై బాలికలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్... నగరంలోని మురుగు నీటి పారుదల వ్యవస్థను పరిశీలించారు. పరిస్థితిని మెరుగుపరచాలని అధికారులను ఆమె ఆదేశించారు.