Permanent Account Number (PAN)
-
ఆధార్‌తో లింకేజీ లేకుంటే పాన్‌కార్డు నిష్ఫలమే
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మార్చి 31వ తేదీనాటికి ఆధార్‌తో అనుసంధానంకాని పర్మినెంట్ అకౌంట్ నంబర్(పాన్) కార్డులు క్రియాశీలకంగా ఉండబోవని ఆదాయ పన్ను శాఖ ఒక బహిరంగ ప్రకటనలో పేర్కొంది. ‘ఆదాయపన్ను చట్టం–1961 ప్రకారం ఎలాంటి మినహాయింపుల పరిధిలోకిరాని పాన్ కార్డు వినియోగదారులు తమ కార్డును ఆధార్‌తో వచ్చే ఏడాది మార్చి 31వ తేదీకల్లా అనుసంధానం చేయడం తప్పనిసరి. ఆధార్‌తో అనుసంధానించని పాన్ కార్డులు ఏప్రిల్ ఒకటోతేదీ నుంచి మనుగడలో ఉండవు. వాటిని ఇన్ఆపరేటివ్గా భావించాలి’ అని ఐటీ శాఖ ఆ బహిరంగ ప్రకటనలో స్పష్టంచేసింది. పాన్ కార్డు మనుగడలో లేకపోతే ఐటీ చట్టం ప్రకారం సంబంధిత కార్డు హోల్డర్ చట్టపరంగా పలు సమస్యలు ఎదుర్కొనే ప్రమాదముందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) మార్చి 30న ఒక సర్క్యులర్‌లో పేర్కొనడం తెల్సిందే. క్రియాశీలకంగాలేని పాన్ కార్డుతో ఐటీ రిటర్న్‌లు దాఖలుచేయడం వీలుకాదు. పెండింగ్‌లో ఉన్న రీఫండ్లు తిరిగిరావు. కట్టాల్సిన పన్నులకు మించి అధికంగా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. నో యువర్ కస్టమర్(కేవైసీ) తప్పనిసరి అయిన బ్యాంక్‌లు, ఆర్థిక సంబంధ వెబ్సైట్లలో పాన్‌కార్డు ఖచ్చితం చేసిన నేపథ్యంలో ఇకపై వారు వాటి ద్వారా నగదు బదిలీ, ఆర్థిక లావాదేవీలు జరపడం దాదాపు అసాధ్యం. సాధారణంగా ఐటీ శాఖకు సంబంధించిన విధానపర నిర్ణయాలను సీబీడీటీనే నిర్ణయిస్తుంది. 2017 మే నెలలో కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన ఒక నోటిఫికేషన్లో ఆ ‘మినహాయింపు కేటగి రీ’ని పేర్కొంది. అస్సాం, జమ్మూకశ్మీర్, మేఘాల యలో ఉండేవారికి ఈ మినహాయింపు వర్తిస్తుంది. ఐటీ చట్టం–1961 ప్రకారం స్థానికే తరులు, 80 ఏళ్లు దాటిన వారు, భారతపౌరులు కాని వారికి ఈ మినహాయింపు ఉంది. -
రెవెన్యూ సెక్రటరీ పోస్టు రద్దు చేయాలి
ఆర్థిక మంత్రికి టార్క్ తొలి నివేదిక న్యూఢిల్లీ: రెవెన్యూ కార్యదర్శి పోస్టు రద్దు... సీబీడీటీ, సీబీఈసీల విలీనం... పర్మనెంట్ అకౌంట్ నంబర్ (పాన్) వినియోగాన్ని విస్తృతపర్చడం... ఇవీ, పన్ను వ్యవస్థ సంస్కరణల కమిషన్(టార్క్) చేసిన కొన్ని సిఫార్సులు. పార్థసారథి షోమ్ సారథ్యంలోని టార్క్ తన తొలి నివేదికను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి అందజేసింది. పన్ను చట్టాలకు పాత తేదీ నుంచి సవరణల అమలుకు స్వస్తిపలకాలని కోరింది. ఆదాయ పన్ను రిటర్నుల్లో సంపద పన్ను వివరాలు కూడా ఉండాలని సూచించింది. ఈ నివేదికలోని కొన్ని సిఫార్సులు... * నిర్ణీతకాలంలో ట్యాక్స్ రిఫండ్ల కోసం బడ్జెట్ కేటాయింపులుండాలి. టీడీఎస్ కోసం పాస్‌బుక్ స్కీమును ప్రవేశపెట్టాలి. * మెరుగైన పన్నుల వ్యవస్థ కోసం సీబీడీటీ, సీబీసీఈల్లో ఎంపిక చేసిన విభాగాలు వెంటనే విలీనం కావాలి. మరో ఐదేళ్లలో ప్రత్యక్ష, పరోక్ష పన్నులకు ఉమ్మడి బోర్డుతో సీబీడీటీ, సీబీసీఈలు ఏకీకృత యాజమాన్యం దిశగా సాగాలి. * కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్, ఈపీఎఫ్ఓ వంటి ప్రభుత్వ విభాగాలకు సైతం ఉపయోగపడే విధంగా పాన్‌ను కామన్ బిజినెస్ ఐడెంటిఫికేషన్ నంబర్ (సీబీఐఎన్)గా మార్చాలి. * ఒకే విభాగం పరిధిలో ఉండే సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్సులకు సింగిల్ రిజిస్ట్రేషన్ అమలు. * సంపద పన్ను రిటర్నులను విడిగా దాఖలు చేయాల్సిన అవసరం లేకుండా ఐటీ రిటర్నుల్లోనే వెల్త్ ట్యాక్స్ రిటర్నులను కలపాలి. ట్యాక్స్ రిఫండ్లను నిర్ణీత కాలంలోపు కచ్చితంగా జారీచేయాలి.