Personal accident insurance
-
వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీదారులకు శుభవార్త..!
వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీదారులకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (ఐఆర్డీఏఐ) గుడ్ న్యూస్ ను అందించింది. ఇకపై వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీలు జీవితాంతం వరకు కొనసాగించేలా నిబంధనలను తీసుకొచ్చేందుకు ఐఆర్డీఏఐ ముసాయిదాను విడుదల చేసింది. పాలసీ పునరుద్ధరణకు ఓకే..! ఆయా పాలసీ కంపెనీలు వయసును కారణంగా చూపించి వ్యక్తిగత బీమా పాలసీ పునరుద్ధరణకు నిరాకరించకూడదని ఐఆర్డీఏఐ ముసాయిదాలో పేర్కొంది. అంతేకాకుండా ఆరోగ్య బీమా పోర్టబులిటీకి నిర్ణీత సమయాన్ని కేటాయించాలని తెలిపింది. బీమా పోర్టబిలిటీ విషయంలో సదరు వ్యక్తికి ఉన్న ఆరోగ్య బీమా పాలసీకి చెందిన బీమా సంస్థను మార్చుకోవాలనుకున్నప్పుడు, దీనికోసం దరఖాస్తు చేసిన ఐదు రోజుల్లోగా కొత్త బీమా సంస్థ, పాత సంస్థ నుంచి సమాచారం తెప్పించుకోవాలనే నిబంధనను కూడా ఐఆర్డీఏఐ ప్రతిపాదించింది. దీంతో సదరు పాలసీదారుడికి కాస్త ఉపశమనం కలిగే అవకాశం ఉంది.పాలసీదారుడి రిస్క్ ప్రొఫైల్ మారినప్పుడు ప్రీమియంలో రాయితీలు కూడా ఇవ్వాలని కోరింది. పూర్తి వివరాలతో... ఐఆర్డీఏఐ ప్రతిపాదన మేరకు ఆయా పాలసీదారుడి ఆరోగ్య వివరాలు, అప్పటివరకు చేసిన క్లెయింలు అందులో ఉండనున్నాయి. ఇక పాలసీ పోర్టబిలిటీ నిర్దీత సమయంలోగా పూర్తయ్యేందుకు ఇది ఉపయోగపడుతుందని నియంత్రణ సంస్థ భావిస్తోంది. ప్రస్తుతానికైతే దీనికి ఎలాంటి గడువులేదు. ఇక పాలసీదారులు తమ పాలసీ మొత్తాన్ని 'పెంచుకోకుండా.. గత పాలసీనే కొనసాగిస్తే...ఎలాంటి వైద్య పరీక్షలు లేకుండా పాలసీ కొనసాగించేలా, కొత్తగా పాలసీ నిబంధనలు మార్చడంలాంటివి చేయొద్దనే నిబంధనలను ఐఆర్డీఏఐ తీసుకురానుంది. ఈ సూచనలపై తమ అభిప్రాయాలను వెల్లడించాలని ఐఆర్డీఏఐ బీమా సంస్థలను కోరింది. -
డెబిట్, క్రెడిట్ కార్డు ఉంటే రూ.10 లక్షల ఉచిత ఇన్సూరెన్స్
బ్యాంకులు జారీ చేసే డెబిట్, క్రెడిట్ కార్డులు కాంప్లిమెంటరీ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజీతో వస్తాయి. దీని గురించి చాలా మంది ఖాతాదారులకు తెలియదు. రూపే కార్డు డెబిట్ కార్డు ఖాతాదారులకు బ్యాంకు బీమా కవరేజీని అందిస్తుందని చెన్నైకి చెందిన ఇండియన్ బ్యాంక్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. బ్యాంకు జారీ చేసిన అన్ని డెబిట్, క్రెడిట్ కార్డ్ వేరియెంట్లు బీమా కవరేజీ అందిస్తాయని ఆయన తెలిపారు. ఖాతాదారులు ప్రమాదవశాత్తు మరణించిన, శాశ్వత సంపూర్ణ వైకల్యం చెందిన బీమా అందిస్తారు. డెబిట్, క్రెడిట్ కార్డులను బట్టి బీమా కవరేజీ ₹50,000 నుంచి ₹10 లక్షల వరకు లభిస్తుంది అని ఇండియన్ బ్యాంక్ అధికారి తెలిపారు. అనుకోకుండా జరిగే ప్రమాదాల వల్ల ఖాతాదారుడు మరణిస్తే లేదా శాశ్వత సంపూర్ణ వైకల్యం చెందితే బీమా కవరేజీ లభిస్తుందని తెలిపారు. ఉద్దేశ్యపూర్వకంగా లేదా స్వయంకృతాపరాధం వల్ల జరిగిన ప్రమాదాలకు కాదు అని ఆయన అన్నారు. బీమా కవరేజీ బ్యాంకుతో వినియోగదారులకు ఉన్న సంబంధంపై ఆధారపడి బీమా కవరేజీ ₹2 లక్షల నుంచి ప్రారంభమై డెబిట్, క్రెడిట్ కార్డులు రెండింటికీ ₹10 లక్షల వరకు లభిస్తుందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వర్గాలు తెలిపాయి. కార్డులు వాడుతూ ఉండాలి ఇటువంటి సదుపాయాల గురించి వినియోగదారులకు అవగాహన లేదని, ఖాతాదారులకు తెలియజేయడం బ్యాంకుల విధి అని వినియోగదారుల ఫోరం యాక్టివిస్ట్ శ్రీ సదాగోపన్ అన్నారు. బీమాక్లెయిం చేసుకోవడానికి ఒక షరతు ఉన్న ఏమిటంటే? కార్డు యాక్టివ్ యూజ్ లో ఉండాలి. క్లెయింలను నిర్ధిష్ట కాలవ్యవధిలో మాత్రమే చేయాలి. ఉదాహరణకు, రూపే బీమా కార్యక్రమం కింద ప్రమాదం జరిగిన తేదీ నుంచి 90 రోజుల్లోగా క్లెయిం కోసం సమాచారం అందించాలి. అలాగే క్లెయింకు సంబంధించిన అన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్ లను సమాచారం ఇచ్చిన తేదీ నుంచి 60 రోజుల్లోగా సబ్మిట్ చేయాలి. ప్రమాదం జరిగిన తేదీకి 90 రోజుల ముందు కార్డుదారుడు ఏదైనా లావాదేవీ(ఆర్థిక లేదా ఆర్థికేతర లావాదేవీ) చేయాల్సి ఉంటుంది. కస్టమర్లకు అందించే బీమా రకం, బీమా క్లెయిం ప్రక్రియ గురించి బ్యాంకులను ఏడాదికి ఒకసారి ఆడిట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. -
విహారయాత్రకు బయలుదేరుతున్నారా?
విహార యాత్రకు వెళ్లే వారు హోటల్ గదులు, ట్రావెల్ టికెట్లను బుక్ చేసుకోవడం, కెమెరా ఎక్విప్మెంట్ తదితర కావాల్సినవి సిద్ధం చేసుకోవడం.. ఇలా ఎన్నో పనులు ఉంటాయి. పర్యటన సమయంలో ఊహించని అత్యవసర పరిస్థితులు ఏర్పడితే, ఆర్థికంగా పడే భారం ఎంతో చెప్పలేం. వైద్య పరంగా అత్యవసర చికిత్స, లగేజీ కోల్పోవడం వంటి పరిస్థితులు ఎదురుకావచ్చు. చివరి నిమిషంలో సమీప వ్యక్తులు మరణించడం వల్ల పర్యటనను రద్దు చేసుకోవాల్సి వస్తే ఆర్థికంగానూ నష్టపోతారు. అందుకే పర్యాటకులకు సరైన ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ అవసరం. ఇది ఎన్నో విధాలుగా రక్షణ కల్పిస్తుంది. మా సంస్థ అంతర్గత డేటాను పరిశీలిస్తే అధిక శాతం క్లెయిమ్లు 60 ఏళ్ల వయసు పైబడిన వారి నుంచే వస్తున్నా కానీ.. అదే సమయంలో 40 శాతం పర్యాటక బీమా పరిహారం కోరుతూ వచ్చే క్లెయిమ్లు 20–40 ఏళ్ల వయసు గ్రూపువే ఉంటున్నాయి. సగటున ఓ క్లెయిమ్ మొత్తం రూ.2,00,000గా ఉంటోంది. ముఖ్యంగా గత మూడేళ్ల కాలంలో వైద్య ఖర్చులకు సంబంధించిన క్లెయిమ్లలో పెరుగుదల 25 శాతంగా ఉంది. కవరేజీ.. పర్యాటక బీమా పాలసీ ప్రధానంగా.. పర్యటన సమయంలో ఇన్పేషెంట్, అవుట్ పేషెంట్ చికిత్సలకు అయ్యే వ్యయాలను చెల్లిస్తుంది. వ్యక్తిగత ప్రమాద బీమా రక్షణ కూడా ఇందులో ఉంటుంది. మణించినా లేక శాశ్వత అంగవైకల్యం పాలైనా పరిహారం పొందొచ్చు. ప్రమాదం కారణంగా గాయపడి ఆస్పత్రిపాలవడం వల్ల పడే ఖర్చులను కూడా చెల్లిస్తుంది. దేశీయ పర్యాటకులకు సంబంధించి బీమా కంపెనీలకు దేశవ్యాప్తంగా ఆస్పత్రులతో టైఅప్ ఉంటుంది. దీంతో పర్యటన సమయంలో ప్రమాదం కారణంగా ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తే నగదు రహిత చికిత్సలను పొందొచ్చు. హాస్పిటల్ డైలీ అలవెన్స్, వైద్యం కోసం అత్యవసర తరలింపు, స్వదేశానికి పంపే కవరేజీలను కూడా ప్రధాన పాలసీకి రైడర్లుగా జోడించునే ఆప్షన్ ఉంటుంది. పర్యటనను కుదించుకోవాల్సి రావడం, కుటుంబ సభ్యుల్లో ఎవరినైనా కోల్పోవడం, విమానం, రైళ్లు ఆలస్యం కావడం, వైద్య పరంగా అత్యవసర చికిత్సలు వంటి సందర్భాల్లో ట్రావెల్ ఇన్సూరెన్స్ రక్షణగా నిలుస్తుంది. బ్యాగేజీని నష్టపోయినా పరిహారం చెల్లిస్తుంది. యువత నేడు ట్రెక్కింగ్, స్కీయింగ్, వాటర్ రాఫ్టింగ్, రాపెల్లింగ్, స్కైడైవింగ్, పారాచ్యూట్, స్కూబా డైవింగ్ వంటి సాహస కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపిస్తోంది. వీటివల్ల ప్రమాదవశాత్తూ గాయాల పాలైతే ట్రావెల్ బీమా పాలసీల్లో కవరేజీ ఉండేలా చూసుకోవాలి. స్వీటీసాల్వే సీనియర్ మేనేజర్, హెల్త్ అడ్మినిస్ట్రేషన్, బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ -
అనుకోని మలుపులలో ఆదుకునే పిలుపు
ఉమన్ ఫైనాన్స్ / వ్యక్తిగత ప్రమాద బీమా ప్రస్తుత పరిస్థితులను మనం గమనించినట్లయితే భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తేనే గాని వారి కుటుంబ పోషణకు, భవిష్యత్తు లక్ష్యాలకు అవసరమైన మొత్తాన్ని సమకూర్చుకోలేరు. మరి ఆ సంపాదించే వారికి అనుకోని ప్రమాదం జరిగితే వచ్చే ఆర్థిక ఇబ్బందులను ఆ కుటుంబం తట్టుకోగలదా? ఇలాంటి అనూహ్యమైన పరిస్థితులలో జీవిత, ఆరోగ్య బీమాతో పాటుగా వ్యక్తిగత ప్రమాద బీమా కూడా ఎంతో చేయూతనిస్తుంది. పాలసీదారుని మరణానంతరం వారి కుటుంబానికి ఆర్థిక చేయూతనివ్వడానికి జీవిత బీమా, అలాగే వైద్యానికి సంబంధించిన ఖర్చులను తట్టుకోడానికి ఆరోగ్య బీమా ఉపయోగపడతాయి. కొన్నిసార్లు ఆ వ్యక్తి ప్రమాదం కారణంగా పూర్తి కోలుకోవడానికి కొన్ని వారాలు, నెలలు, సంవత్సరాలు పట్టవచ్చు. ఈ క్రమంలో వారి ఆదాయం ఆగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తిగత ప్రమాద బీమా ఆర్థికంగా ఎంతో తోడ్పాటునిస్తుంది. ఈ బీమా ఏ విధంగా పని చేస్తుందో చూద్దాం. ప్రమాదం ద్వారా మరణం సంభవిస్తే... పాలసీదారునికి ప్రమాదం ద్వారా మరణం సంభవించినట్లయితే అతను ఎంత మొత్తానికి పాలసీ తీసుకున్నారో ఆ మొత్తాన్ని నామినీకి అందజేస్తారు. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు అదనంగా వారి పిల్లల విద్యకు బోనస్ను (ఇద్దరు పిల్లల వరకు) ఇస్తున్నాయి. శాశ్వతంగా పూర్తి వైకల్యం సంభవిస్తే... ప్రమాదంలో కొన్నిసార్లు పూర్తి వైకల్యం సంభవించే పరిస్థితులు ఏర్పడతాయి. ఉదాహరణకు రెండు కాళ్లు / రెండు చేతులు పోవడం. ఒక కాలు, ఒక చేయి పోవడం మొదలైనవి. ఈ సందర్భంలో ఆ వ్యక్తి ఎటువంటి పని చేయడానికీ వీలుండదు. ఇలాంటి వాటిని శాశ్వతమైన పూర్తి వైకల్యంగా పరిగణిస్తారు. ఈ పరిస్థితుల్లో కొన్ని కంపెనీలు పాలసీదారుడు ఎంత మొత్తాన్ని పాలసీగా తీసుకుంటారో ఆ మొత్తాన్నీ, మరికొన్ని కంపెనీలు 10 శాతం, 20 శాతం అదనంగా కూడా అందజేస్తున్నాయి. అందుకే పాలసీ తీసుకోబోయే ముందు ఈ విషయాన్ని పూర్తిగా పరిశీలించి తీసుకోవడం మంచిది. శాశ్వత, పాక్షిక వైకల్యం... కొన్నిసార్లు ప్రమాదం జరిగినప్పుడు పాక్షికంగా కొంత మేర శాశ్వత వైకల్యం ఏర్పడవచ్చు. అలాంటప్పుడు వైకల్యం ఎంత మేరకు (ఎంత శాతం) జరిగిందో, ఆ శాతం ఆధారంగా నష్టపరిహారం ఉంటుంది. తాత్కాలిక వైకల్యం.. కొన్నిసార్లు ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదం నుండి కోలుకుని మళ్లీ పని చేయడం మొదలు పెట్టడానికి సమయం పడుతుంది. ఈ సమయంలో అతను కోల్పోయిన ఆదాయాన్ని భర్తీ చేయడానికి వారానికి కొంత మొత్తాన్ని పాలసీదారునికి అందజేస్తారు. వ్యక్తిగత బీమా పాలసీని వ్యక్తిగతంగానూ, ఆలాగే జీవిత భాగస్వామి, పిల్లల పేర్ల మీద కూడా ఒకే పాలసీ కింద తీసుకోవచ్చు. అలా తీసుకున్నప్పుడు 10 శాతం డిస్కౌంట్ కూడా పొందవచ్చు. గరిష్టంగా ఎంత మొత్తానికి పాలసీ ఇస్తారు అనేది మీ ఆదాయాన్ని బట్టి ఉంటుంది. అలాగే మీరు కట్టే కంపెనీని బట్టి కూడా మారుతుంది. పాలసీని తీసుకోవడం ఎంత ముఖ్యమో, ఆ పాలసీ గురించి మీ కుటుంబ సభ్యులందరికీ ముందే అవగాహన కల్పించడం కూడా అంతే ముఖ్యం. ఇలా అవగాహన కల్పించడం వల్ల ప్రమాదం జరిగినప్పుడు సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీకి వెంటనే సమాచారం ఇవ్వడం, పరిహారం పొందడానికి అవసరమైన ఇతర పత్రాలు (పోలీస్ ఎఫ్.ఐ.ఆర్., వైద్య పరీక్షల నివేదికలు మొదలైనవి) సమకూర్చడంలో ఇబ్బందులు ఎదుర్కోనవసరం లేకుండా ఉంటుంది. ప్రమాదం వల్ల జరిగిన నష్టాన్ని పూర్తిగా భర్తీ చేసుకోలేకపోవచ్చు. కానీ ఆర్థికంగా పూర్తి చేయూతనివ్వడానికి ఈ వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రజని భీమవరపు ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’