హవ్వా! ఇదెక్కడి లూటీ
రూ. 85 కోట్ల విలువైన పనులకు రూ. 850 కోట్లు!
బినామీ పేర్లతో మంత్రి సునీత దోపిడీ
తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
ఆత్మకూరు : ప్రజాధనాన్ని మంత్రి పరిటాల సునీత యథేచ్ఛగా దోపిడీ చేస్తోందని ౖÐð ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. రూ. 85 కోట్లతో పూర్తి అయ్యే పేరూరు డ్యాం పనులకు రూ. 850 కోట్లు మంజూరు చేయించుకున్నారని తెలిపారు. మండలంలోని వేపచెర్లలో ఆదివారం సాయంత్రం ఆయన రైతుల సమావేశంలో మాట్లాడారు. 20.8లో జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు నాయుడు నాడు ప్రతిపక్ష హోదాలో మాట్లాడుతూ... జిల్లాలో బీటీపీ, పేరూరు డ్యాంకు రూ. 1,300 కోట్లు కేటాయిస్తే అభివృద్ధి సాధ్యమని ప్రకటించారని గుర్తు చేశారు. పెరిగిన వ్యయంతో పోలిస్తే ఇప్పుడు ఈ పనులకు రూ. 85 కోట్లు సరిపోతాయని వివరించారు. అయితే ఇందుకు విరుద్ధంగా రూ. 850 కోట్లు ప్రకటించడం టీడీపీ నేతల దోపిడీకి నిదర్శనమని పేర్కొన్నారు.
బినామీలతో సర్వే
పేరూరు డ్యాం పనులకు సంబంధించి అంచనాలు రూపొందించేందుకు చేపట్టిన సర్వేలో ప్రభుత్వాధికారుల ప్రమేయాన్ని మంత్రి సునీత తప్పించారని, ఆ స్థానంలో తన బినామీలతో పనులు చక్కబెట్టించారని ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. దీంతో కేంద్రం నుంచి తెచ్చిన నిధులకు లెక్కలు లేకపోవడంతో వాటిని జిల్లా మంత్రులు అడ్డగోలుగా స్వాహా చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లా రైతులపై చిత్తశుద్ధి ఉంటే హంద్రీనీవా ఆయకట్టును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే హంద్రీనీవా జలాలతో జిల్లాను సస్యశ్యామలం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, వందలాది మంది రైతులు పాల్గొన్నారు.