ఇరాక్‌లో ఐసిస్ నరమేధం
ఆత్మాహుతి దాడిలో : 70 మంది మృతి
హిల్లా: ఇరాక్‌లోని దక్షిణ బాగ్దాద్‌లో ఐసిస్ గురువారం జరిపిన ఆత్మాహుతి బాంబు దాడిలో 70 మంది చనిపోయారు. మృతుల్లో అత్యధికులు షియాలే ఉన్నట్లు తెలిసింది. పెట్రోల్ బంకులో నిలిపి ఉంచిన యాత్రికుల బస్సుల మధ్యలో బాంబులతో నిండిన ట్రక్కును పేల్చారు. రాజధాని బాగ్దాద్‌కు 120 కి.మీ. ల దూరంలోని షోమలి అనే గ్రామంలో ఈ దాడి జరిగింది. బస్సుల మధ్యలో పెద్ద ట్రక్కు పేలిందని, ఇది ఆత్మాహుతి దాడి అని స్థానిక భద్రతా చీఫ్ ఫలా అల్ రాధీ చెప్పారు.
చనిపోయిన 70 మందిలో పది కన్నా తక్కువే ఇరాక్ ప్రజలున్నారని, మిగతా వారంతా ఇరాన్ వాసులని తెలిపారు. గాయపడిన 20 మందిని సమీప ఆసుపత్రులకు తరలించినట్లు వెల్లడించారు. దాడి జరిగిన ప్రాంతంలో చెల్లాచెదురుగా పడిఉన్న అవశేషాలు సామాజిక మాధ్యమాల్లో విసృ్తతంగా వ్యాపించాయి. పేలుడుకు వాడిన ట్రక్కులో 500 లీటర్ల అమోనియం నైట్రేట్‌ను నింపినట్లు బాగ్దాద్‌లోని జాయింట్ ఆపరేషన్ కమాండ్ పేర్కొంది.