జయంతి.. ఓ దెయ్యం
అనగనగా ఓ దెయ్యం. ఆ దెయ్యానికి తల ఉండదు. దీనికి కారకులు ఎవరు? వారిపై తల లేని దెయ్యం ఎలా ప్రతీకారం తీర్చుకుంది? అనే కథతో రూపొందిన సినిమా ‘జయంతి’. ఫణిరాజ్ హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. వచ్చే నెలలో రిలీజ్ చేయాలను కుంటున్నారు. ఫణిరాజ్ మాట్లాడుతూ – ‘‘జయంతి అనే ఓ దెయ్యం కథే ఈ సినిమా. బ్రహ్మానందం, అలీ, పోసానిల సన్నివేశాలు వినోదాన్ని పంచుతాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: తారక్ –ఫణిరాజ్.