Pharmaceutical company Aurobindo Pharma
-
మార్కెట్లోకి అరబిందో మోల్నాఫ్లూ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ సంస్థ అరబిందో ఫార్మా.. కోవిడ్–19 చికిత్సలో వాడే యాంటీ వైరల్ డ్రగ్ మోల్నుపిరావిర్‌ను మోల్నాఫ్లూ పేరుతో భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ‘డీసీజీఐ నుంచి సకాలంలో లైసెన్స్డ్ వర్షన్ మోల్నుపిరావిర్ (మోల్నాఫ్లూ) ఔషధానికి అనుమతి లభించడంతో మేము సంతోషిస్తున్నాము. దీంతో కోవిడ్–19 రోగులకు చవకైన చికిత్స అందుబాటులోకి వచ్చింది. సమర్థవంతమైన, అధిక నాణ్యత కలిగిన ఔషధ ఉత్పత్తులతో మహమ్మారిని ఎదుర్కోవడంలో ఇది సహాయం చేస్తుంది’ అని అరబిందో వైస్ చైర్మన్, ఎండీ కె.నిత్యానంద రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్‌ను కంపెనీ సొంతంగా తయారు చేస్తోంది. యూఎస్ఎఫ్డీఏ, యూకే ఎంహెచ్ఆర్ఏ ఆమోదం పొందిన ప్లాంట్లలో మోల్నాఫ్లూ ఉత్పత్తి అవుతోంది. డిమాండ్‌కు తగ్గట్టుగా మోల్నాఫ్లూ సరఫరా చేసే సామర్థ్యం తమకు ఉందని సంస్థ వెల్లడించింది. భారత్‌తోసహా 100కుపైగా తక్కువ, మధ్యస్థాయి ఆదాయ దేశాలకు ఈ ఔషధాన్ని సరఫరా చేసేందుకు అరబిందో ఫార్మా గతేడాది మెర్క్ అండ్ కో సంస్థతో ఒప్పందం చేసుకుంది -
ఈ ఏడాది రూ.900 కోట్ల పెట్టుబడి: అరబిందో
ఔషధ కంపెనీ అరబిందో ఫార్మా 2015-16లో రూ.800-900 కోట్లు పెట్టుబడి పెట్టాలని భావిస్తోంది. తయారీ సామర్థ్య విస్తరణ, ఔషధ పరీక్షలు, ఉత్పత్తుల నమోదుకు ఈ నిధులను వెచ్చించనుంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.700 కోట్లు ఖర్చు చేసింది. -
ఈ ఏడాది రూ.900 కోట్ల పెట్టుబడి: అరబిందో
న్యూఢిల్లీ: ఔషధ కంపెనీ అరబిందో ఫార్మా 2015-16లో రూ.800-900 కోట్లు పెట్టుబడి పెట్టాలని భావిస్తోంది. తయారీ సామర్థ్య విస్తరణ, ఔషధ పరీక్షలు, ఉత్పత్తుల నమోదుకు ఈ నిధులను వెచ్చించనుంది. 2014-15లో రూ. 700 కోట్లు ఖర్చు చేసినట్టు అరబిందో ఫార్మా ఎండీ ఎన్.గోవిందరాజన్ తెలిపారు. సంస్థ అనుబంధ కంపెనీ అయిన అమెరికాకు చెందిన ఆరోమెడిక్స్ ఫార్మా నాలుగు ఇంజెక్టబుల్ ఉత్పత్తుల అభివృద్ధిలో నిమగ్నమైందని ఆరోమెడిక్స్ సీఈవో రొనాల్డ్ క్వాడ్రెల్ తెలిపారు. అనుబంధ కంపెనీ ఆక్టావిస్ ఉత్పత్తులను భారత్‌లో విడుదల చేయాలని అరబిందో భావిస్తోంది.