Pharmaceutical sectors
-
‘హురూన్’ సంపన్నుల్లో మనోళ్లు 69 మంది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ ఇండియా సంపన్నుల జాబితా–2021లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి 69 మంది చోటు సంపాదించారు. వీరందరి సంపాదన రూ.3,79,200 కోట్లు. గతేడాదితో పోలిస్తే ఇది 54 శాతం వృద్ధి. కొత్తగా 13 మంది ఈ లిస్ట్‌లో చేరారు. మొత్తం జాబితాలో ఇద్దరు మహిళలు ఉన్నారు. అయితే ఔషధ తయారీ రంగం నుంచే 21 మంది ఉండడం విశేషం. రూ.1,000 కోట్లు, ఆపైన సంపద కలిగిన వ్యక్తులతో ఈ జాబితాను రూపొందించారు. వీరిలో హైదరాబాద్ నుంచి 56 మంది, రంగారెడ్డి నుంచి నలుగురు, విశాఖపట్నం నుంచి ముగ్గురు ఉన్నారు. సెపె్టంబర్ 15 నాటికి బిలియన్ డాలర్లకుపైగా సంపద కలిగిన వారి సంఖ్య ఏడాదిలో 9 నుంచి 15కు చేరింది. రూ.79,000 కోట్లతో దివీస్ ల్యా»ొరేటరీస్ వ్యవస్థాపకులు మురళి దివి, ఆయన కుటుంబం తొలి స్థానంలో నిలిచింది. పదేళ్ల క్రితం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ లిస్ట్‌లో ముగ్గురు మాత్రమే నమోదయ్యారు. ఈ ఏడాది జాబితాలో పేరు దక్కించుకున్న వారిలో మొదటి అయిదు స్థానాల్లో జి.అమరేందర్‌రెడ్డి, కుటుంబం, వెంకటేశ్వర్లు జాస్తి, కుటుంబం, ఏ.ప్రతాప్ రెడ్డి (బాలాజీ అమైన్స్), దాసరి ఉదయ్‌కుమార్ రెడ్డి (తాన్లా ప్లాట్‌ఫామ్స్), అనిల్ కుమార్ చలమలశెట్టి (గ్రీన్కో), మహేశ్ కొల్లి(గ్రీన్కో) ఉన్నారు. -
అంచనాలు తప్పిన ఔషధ ఎగుమతులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఔషధ రంగానికి కోవిడ్–19 దెబ్బ పడింది. ఎగుమతుల అంచనా తప్పింది. 2019–20లో భారత్ నుంచి రూ.1,65,000 కోట్ల విలువైన ఔషధ ఉత్పత్తులు ఎగుమతి అవుతాయని ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఫార్మెక్సిల్) గతంలో అంచనా వేసింది. వాస్తవానికి రూ.1,54,350 కోట్ల విలువైన మందులు ఎగుమతి అయ్యాయి. అయితే 2018–19తో పోలిస్తే ఇది 7.57 శాతం వృద్ధి అని ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ రవి ఉదయ్ భాస్కర్ తెలిపారు. ఏప్రిల్–డిసెంబర్లో ఎగుమతుల వృద్ధి 11.5 శాతంగా ఉందని చెప్పారు. జనవరి–మార్చిలో 2.97 శాతం తిరోగమన వృద్ధి నమోదైంది. మొత్తం ఎగుమతుల్లో 72 శాతంగా ఉన్న డ్రగ్ ఫార్ములేషన్స్, బయలాజికల్స్ 9.5 శాతం వృద్ధి సాధించాయి. రెండవ అతిపెద్ద విభాగమైన బల్క్ డ్రగ్స్, డ్రగ్ ఇంటర్మీడియేట్స్ 0.73 శాతం తిరోగమన బాట పట్టాయి. 32.74 శాతం వాటా దక్కించుకున్న యూఎస్ఏకు ఎగుమతులు 15.8 శాతం అధికమై రూ.50,250 కోట్లకు చేరుకున్నాయి. -
ఔషధ రాజధానిగా తెలంగాణ
ఐపీఎస్‌ఎఫ్ వరల్డ్ కాంగ్రెస్‌లో మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: ఔషధ రంగానికి రాజధానిగా తెలంగాణకు, ప్రత్యేకించి హైదరాబాద్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఇంటర్నేషనల్ ఫార్మాస్యూటికల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఐపీఎస్‌ఎఫ్), ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ సంయుక్తంగా శుక్రవారం హోటల్ మారియట్‌లో 61వ వరల్డ్ కాంగ్రెస్-2015ను నిర్వహించాయి. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దేశమంతటా తయారవుతున్న బల్క్ డ్రగ్స్‌లో తెలంగాణ నుంచే 40 శాతం ఉత్పత్తి జరుగుతోందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వినియోగిస్తున్న వ్యాక్సిన్లలో మూడోవంతు టీకాలు హైదరాబాద్‌లో ఉత్పత్తి చేసినవేనన్నారు. ఇండియాతో పాటు అన్ని దేశాలు పరిశోధనల కోసం అధికంగా నిధులు వెచ్చిస్తున్నాయని, అయితే సమాజానికి మేలు చేయని పరిశోధనల వలన ఎటువంటి ప్రయోజనం లేదని పేర్కొన్నారు. ప్రజలకు తక్కువ ఖర్చుతో ఎక్కువ విలువైన ఔషధాలను అందించాల్సిన కర్తవ్యం ఔషధ రంగ నిపుణులపై ఉందన్నారు. హైదరాబాద్‌లో లైఫ్‌సెన్సైస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఏరోస్పేస్ రంగాల అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని, వివిధ రంగాల్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికోసం రాష్ట్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని తెచ్చిందన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఔషధ రంగ పరిశోధనల ఫలితాలను మేళవించి సమాజానికి మేలు జరిగే విధంగా కొత్త ఆవిష్కరణలు తెచ్చేందుకు ఈ సదస్సు దోహదపడాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ సురేశ్ మాట్లాడుతూ.. భారతీయ ఔషధ మండలిలో 10 లక్షల మంది ఔషధ రంగ నిపుణులు తమ పేర్లు నమోదు చేసుకున్నారని ప్రకటించారు. ఏటా లక్షమంది ఫార్మసీ విద్యను అభ్యసిస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీఎస్ఐఐసీ ఉపాధ్యక్షుడు నర్సింహారె డ్డి, ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రావు వడ్లమూడి, ఉపాధ్యక్షుడు టీవీ నారాయణ, ఐపీఎస్‌ఎఫ్ అధ్యక్షురాలు పరాంక్, వరల్డ్ కాంగ్రెస్-2015 చైర్పర్సన్ నేహా దెంబ్లా, ప్రోగ్రామ్ కన్వీనర్ జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పలు ఫార్మసీ కళాశాలల విద్యార్థులు, 55 దేశాల నుంచి 350 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు.