Pharmacy Stores
-
ఐవీఎఫ్ హార్మోన్ల బదులు అబార్షన్ బిళ్లలిచ్చారు!
న్యూయార్క్: వైద్యపరమైన నిర్లక్ష్యానికి పరాకాష్ట ఈ ఉదంతం. అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో సంతానం కోసం ఐవీఎఫ్ పద్ధతిని ఆశ్రయించిన తమికా థామస్ అనే మహిళకు మెడికల్ షాపు ఐవీఎఫ్ హార్మోన్ల బదులు పొరపాటున అబార్షన్ మాత్రలు ఇచి్చంది. ఏకంగా ఇద్దరు గర్భస్థ శిశువుల మరణానికి కారణమైంది! పుట్టబోయే బిడ్డలను పొట్టన పెట్టుకున్నారంటూ మెడికల్ షాప్‌పై ఆమె స్టేట్ బోర్డ్ ఆఫ్ ఫార్మసీకి ఫిర్యాదు చేసింది. ప్రిస్క్రిప్షన్‌లోని డాక్టర్ చేతిరాత అర్థం కాకపోవడం ఈ దారుణ పొరపాటుకు దారి తీసినట్టు విచారణలో తేలింది. ‘షాపు సిబ్బంది తప్పు మీద తప్పు చేశారు. ఆ రాతను తమకు తోచినట్టుగా అర్థం చేసుకుని ఈ నిర్వాకానికి పాల్పడ్డారు. పైగా తాము ఏం మందులు ఇస్తున్నదీ, వాటివల్ల ఏం జరుగుతుందన్నది విధిగా చెప్పాల్సి ఉండగా ఆ పని కూడా చేయలేదు’అని బోర్డు తేలి్చంది. మెడికల్ షాప్‌కు పది వేల డాలర్ల జరిమానా విధించింది. కానీ దీనివల్ల పుట్టక ముందే కన్ను మూసిన తమ బిడ్డలు తిరిగొస్తారా అంటూ థామస్ దంపతులు విలపిస్తున్నారు. వారికి నలుగురు సంతానం. పెద్ద కుటుంబం కావాలనే కోరికతో మళ్లీ పిల్లలను కనాలని నిర్ణయించుకుని ఐవీఎఫ్ పద్ధతిని ఆశ్రయించారు. -
ఫార్మ'ఛీ'
వైఎస్ఆర్ జిల్లా, బద్వేలు: పోరుమామిళ్లకు చెందిన ఒక వ్యక్తి కాళ్లు, చేతులు నొప్పి ఉండటంతో ఔషధ దుకాణానికి వెళ్లారు. దుకాణంలోని వ్యక్తికి తన సమస్య చెప్పి మాత్రలు అడిగారు. అతను ఇచ్చిన మాత్రలు వేసుకున్న తరువాత శరీరమంతా దద్దుర్లు, దురద వచ్చాయి. దీంతో వెంటనే వైద్యుడి దగ్గరకు వెళ్లగా తాను వేసుకున్న మాత్రలు రియాక్షన్ ఇవ్వడంతో ఇలా జరిగిందని ఆయన చెప్పారు. ఫార్మసీ దుకాణంలో ఉన్న వ్యక్తికి సరైన అవగాహన లేకపోవడం, ఫార్మసిస్టు కాకపోవడమే దీనికి కారణం. ఇలాంటి పరిస్థితి చాలా పట్టణాల్లో రోజూ చూడవచ్చు. జిల్లాలోని అధికశాతం ఔషధ దుకాణాల్లో కనీసం ఫార్మసిస్టులు లేకుండానే మందుల విక్రయాలు జరుగుతున్నాయనేది బహిరంగ రహస్యం. డిప్లొమో, బీఫార్మసీ చదువుకున్న వారికిసంబంధించిన సర్టిఫికెట్లు కంట్రాక్టు పద్ధతిన తీసుకుని దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఈ దుకాణాల్లో అవగాహన లేని వ్యక్తులను ఉంచి మందుల అమ్మకాలు సాగిస్తున్నారు. అద్దెకు సర్టిపికెట్లు : జిల్లాలోని అధికశాతం ఫార్మసీ దుకాణాల్లో నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అవగాహన ఉన్న వ్యక్తులు మాత్రమే డాక్టరు రాసిన ప్రిస్కిప్షన్‌కు సరైన మందులు ఇవ్వగలరు. చాలా దుకాణాల్లో కనీస అవగాహన లేని వ్యక్తులు ఉంటున్నారు. జిల్లాలో 1250 పైగా ఫార్మసీ దుకాణాలు, 350 హోల్‌సేల్ దుకాణాలు ఉన్నాయి. కడప డివిజన్లో 700, ప్రొద్దుటూరు డివిజన్ పరిధిలో 550 ఫార్మసీ దుకాణాలు ఉండగా వీటి ద్వారా రోజుకు రూ.7 కోట్లపైనే లావాదేవీలు జరుగుతున్నాయని అంచనా. సగానికి పైగా దుకాణాల్లో ఫార్మసిస్టులు లేకుండానే అమ్మకాలు సాగుతున్నాయంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో తెలుస్తుం ది. బీఫార్మసీ, ఎం ఫార్మసీ చదువుకున్న వారి సర్టిఫికెట్లను అద్దెకు తీసుకుని లామినేషన్ చేయించి షాపుల్లో తగిలిస్తున్నారు. సరిఫికెట్‌దారుడు వాస్తవంగా మరోచోట ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. సర్టిఫి కెట్ ఇచ్చినందుకు డిప్లొమో అభ్యర్థులకు నెలకు రూ.2వేలు, బీఫార్మసీ వారికైతే నెలకు రూ.3 వేల వరకు ఇస్తున్నారు. దుకాణాలు, కార్పొరేట్ స్థాయి మెడికల్ షాపుల్లో కూడా ఇదే పరిస్థితి. ఔషధ నియంత్రణ మండలి అధికారులు మాత్రం తూతూమంత్రంగా పర్యవేక్షణ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. నిబంధనలు పాటిస్తే ఒట్టు చాలా ఔషధ దుకాణాల్లో ఏసీ సదుపాయం ఉండదు. నిబంధనల ప్రకారం తగిన ఉష్ణోగ్రతలో మందులు దాచిపెట్టి స్టోరేజీ చేయాల్సి ఉన్నా అది ఏ దుకాణంలోనూ కనిపించదు. ఎక్కడ పడితే అక్కడ మందులను సర్దేసి అమ్మకాలు సాగిస్తున్నారు. మెజార్టీ షాపుల్లో సైతం ఇదే దుస్థితి. ఫార్మసీ నిర్వాహకులు, ఔషధ నియంత్రణ మండలి అధికారులకు పట్టవు. మందుల అమ్మకాలు సైతం ఇష్టారాజ్యంగా సాగితున్నాయి. రోగ నివారణకు ఉపయోగించే మందులకు సరైన స్టోరేజీ లేకపోవడంతో అవి విషపూరితంగా మారుతున్నాయి. కొన్ని రకాల క్రీములు, ఇంజక్షన్లు, వ్యాక్సిన్లు, అయింట్మెంట్లు తగిన ఉష్ణోగ్రతలో తప్పనిసరిగా ఉంచాలి. రిప్రిజిరేటర్ ఉష్ణోగ్రత రెండు నుంచి ఎనిమిది డిగ్రీలు, ఫార్మసీలో ఏసీ ఉష్ణోగ్రత 25–30 డిగ్రీల మధ్య ఉండాలి. ఏసీ, రిఫ్రిజిరేటర్ ఉంటేనే అనుమతి ప్రతి ఔషధ దుకాణంలో రిఫ్రిజిరేటర్, ఏసీ ఉండాల్సిందే. అవి ఉంటేనే ఔషధ నియంత్రణ సంస్థ డ్రగ్ లైసెన్స్ ఉండాలి. చాలా ఫార్మసీల్లో ఇవి కనిపించవు. క్యాన్సర్, గుండె, న్యూరాలజీ, మధుమేహం వంటి కొన్ని రకాల జబ్బులకు సంబంధించిన మందులను ఏసీ, రిఫ్రిజిరేటర్ సదుపాయం ఉన్న చోటనే నిల్వ చేయాలి. హార్మోన్లు, ఎంజైమ్స్కు సంబంధించిన ఔషధాలు సూచించిన ప్రకారం తగిన ఉష్ణోగ్రతలో నిల్వ ఉంచాలి. లేకపోతే మందుల సామర్థ్యం తగ్గిపోతోందని వైద్యులు చెబుతున్నారు. -
గీత దాటితే దుకాణం బంద్!
సంగారెడ్డి క్రైం : జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించే ఫార్మసీ దుకాణాలు, యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఔషధ నియంత్రణ మండలి జిల్లా అసిస్టెంట్ డెరైక్టర్ సీహెచ్ రాజవర్ధనాచారి హెచ్చరించారు. ఇటీవల ఆయన విజయవాడ నుంచి బదిలీపై సంగారెడ్డికి వచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం ‘సాక్షి’తో మాట్లాడారు. ముఖ్యంగా లెసైన్సులు లేని షాపులపై చర్యలు తప్పవన్నారు. జిల్లాలోని సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌లలో డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా తనిఖీలను విస్తృతం చేశామన్నారు. ‘ఇటీవల జహీరాబాద్‌లోని ఓ మెడికల్ షాప్‌లో కాలం చెల్లించిన మందులను విక్రయించగా దాడులు నిర్వహించి పట్టుకున్నాం. ఆ దుకాణంపై కేసు నమోదు చేయడంతో పాటు సీజ్ చేశాం. అభ్యంతరకరమైన ప్రకటనలకు సంబంధించి సిద్దిపేటలో ఐదు కేసులు నమోదు చేశాం. జిల్లా వ్యా ప్తంగా మొత్తం 70 ఫార్మసీల్లో తనిఖీలు నిర్వహించి కొన్నింటికి నోటీసులు పంపాం. ఈ నోటీసులకు యజమానులు స్పందించకుంటే చర్యలకు ఉపక్రమిస్తాం. అన్ని మందుల దుకాణాల్లో ఫార్మాసిస్టులు తప్పకుండా అందుబాటులో ఉండాలి. జిల్లాలోని చాలా దుకాణాల్లో ఫార్మాసిస్టులు లేకుండా మం దులు విక్రయిస్తున్నట్టు ఇటీవల చేసిన దాడుల్లో వెల్లడైంది. ఇక నుంచి అలా జరుగకుండా వారికి నోటీసులు జారీ చేశాం. ఏ ఒక్క దుకాణం నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించినా కేసులు నమోదు చేసి సీజ్ చేస్తాం. ముఖ్యంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మందులు అమ్మాలి’ అని రాజవర్ధన్ చెప్పారు. క్రిమినల్ కేసులకూ వెనకాడం... ‘ఫెన్సిడిల్ వంటి మత్తు మందులను డాక్టర్ సూచించిన వారికి మాత్రమే విక్రయించాలి. కొందరు యువకులు ఇలాంటి మత్తునిచ్చే మందులకు అలవాటు పడి ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. నిబంధనలను ఉల్లంఘించి ఈ తరహా మెడిసిన్స్ విక్రయిస్తే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తాం. వీటి అమ్మకాలపై గట్టి నిఘా కూడా పెట్టాం. డాక్టర్ సూచించిన ప్రి స్క్రిప్షన్ ఆధారంగానే మందులు విక్రయించాలి. అలాగే వినియోగదారులకు తప్పకుండా రశీదు ఇవ్వాలి. రశీదు ఇవ్వడానికి ఎక్కువ బిల్లు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం. అలాగే ఆర్ఎంపీ వైద్యులు సైతం తమ ఫార్మసీ విక్రయాల కోసం లెసైన్సులు రెన్యూవల్ చేసుకోవాలి. ఎక్కడైనా ఫిజీషియన్ శాంపిల్స్‌ను విక్రయించినట్లు తమకు ఫిర్యాదులు వస్తే సదరు వైద్యులు, క్లినిక్‌లపై కూడా కేసులు నమోదు చేస్తాం. వైద్యులు తమ క్లినిక్‌లలో కూడా మందులను నిబంధనల మేరకే విక్రయించాలి. ఫార్మసీలు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగినా, మరే ఇతర ఇబ్బందులు ఎదురైనా వినియోగదారులు మాకు నేరుగానైనా లేదా 08455-276548 ఫోన్ నంబర్‌కు అయినా కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు’ అని రాజవర్ధనాచారి సూచించారు.