phitriyani
-
సైనా జోరుగా ముందుకు..
సారావక్ (మలేసియా): మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మరో విజయం సాధించింది. వరుసగా మూడో విజయంతో సైనా నెహ్వాల్ సెమిఫైనల్స్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సైనా 21-15, 21-14 తేడాతో ఇండోనేసియాకు చెందిన ఫిత్రియానిని ఓడించింది. వరుస పాయింట్లు సాధిస్తూ ఎనిమిదో సీడెడ్ ప్లేయర్ ఫిత్రియానిని తికమక పెట్టి తొలి సెట్ కైవసం చేసుకున్న టాప్ సీడ్ సైనా రెండో సెట్లోనూ పోరాటం కొనసాగించింది. 40 నిమిషాల్లో గేమ్ ముగించి సైనా సెమిస్లో ప్రవేశించింది. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో ఆరో సీడ్ అజయ్ జయరామ్ కూడా క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టాడు. క్వార్టర్స్ మ్యాచ్‌లో ఆంథోనీ సినిసుకా గింటింగ్ (ఇండోనేసియా) చేతిలో 21-13, 21-8 తేడాతో జయరామ్ ఓటమిపాలయ్యాడు. రెండు వరుస సెట్లలో జయరామ్ చేతులెత్తేయడంతో ప్రత్యర్థి ఆంథోనీ కేవలం 28 నిమిషాల్లోనే నెగ్గి సెమిఫైనల్స్ చేరుకున్నాడు. -
క్వార్టర్ ఫైనల్లో సైనా
సారావక్ (మలేసియా): వరుసగా రెండో విజయం సాధించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్... మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సైనా 21–17, 21–12తో హనా రమాదిని (ఇండోనేసియా)పై గెలిచింది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ ఫిత్రియాని (ఇండోనేసియా)తో సైనా ఆడుతుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో ఆరో సీడ్ అజయ్ జయరామ్ కూడా క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో జయరామ్ 21–12, 15–21, 21–15తో సుయె సువాన్ యి (చైనీస్ తైపీ)పై గెలుపొందాడు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సుమిత్ రెడ్డి–మనూ అత్రి (భారత్) ద్వయం 17–21, 21–18, 12–21తో గుణవా¯ŒS–కిడో (ఇండోనేసియా) జంట చేతిలో ఓడిపోయింది. మిక్స్డ్ డబుల్స్‌లో గుత్తా జ్వాల–మనూ అత్రి జోడీ 18–21, 10–21తో అహ్మద్–గ్లోరియా (ఇండోనేసియా) జంట చేతిలో ఓటమి పాలైంది.