ఆహార భద్రత కార్డులపై నేడు ఫోన్‌ఇన్
సమస్యలు తెలియజేయాల్సిన నంబర్
08682-244509
సమయం : ఉదయం 10 నుంచి 11 గంటల వరకు
రాంనగర్ : జిల్లా ఆహారభద్రత కార్డుల కోసం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జేసీ సత్యనారాయణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులై ఉండి ఆహారభద్రత కార్డులు రాకున్నా, ఒకవేళ జాబితాలో పేరు వచ్చి రేషన్‌షాపులో పేరు లేకున్నా ఫోన్ ఇన్ కార్యక్రమానికి తెలియజేయాలని కోరారు. అదే విధంగా అనర్హులకు కార్డులు వచ్చినా కూడా తనకు తె లియజేయాలని తెలిపారు. ఈ అ వకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 08682-244509 ఫోన్ నంబర్ ద్వారా తెలిపాలని సూచించారు.