Phone Battery
-
విషాదం: ఫోన్ బ్యాటరీని నాలుకతో నాకటంతో..
మీర్జాపూర్ : ఉత్తర ప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ బాలుడు తన ఫోన్ బ్యాటరీని నాలుకతో నాకగా అది పేలింది. దీంతో అతడు మృత్యువాత పడ్డాడు. శుక్రవారం చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. మీర్జాపూర్ జిల్లా మత్వార్ గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలుడు మోనూ శుక్రవారం ఉదయం తన సెల్‌ఫోన్ బ్యాటరీకి జాదూ చార్జర్‌లో చార్జింగ్ పెట్టాడు. ఓ గంట తర్వాత బ్యాటరీ పవర్‌ను పరీక్షించడానికి దాన్ని నాలుకతో నాకాడు. ‘‘ఢాం!!’’ అని పెద్ద శబ్ధం చేస్తూ బ్యాటరీ ముఖం మీదే పేలింది. దీంతో ముఖానికి తీవ్రగాయాలై బాలుడు మరణించాడు. శబ్ధం విన్న కుటుంబసభ్యులు అతడి వద్దకు వెళ్లి చూడగా.. రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే అతడ్ని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. మోనూ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ సంఘటనపై పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే కుటుంబసభ్యులు మోనూ అంత్యక్రియలు జరిపించారు. చదవండి : తప్పించుకున్న 72 గంటల్లోనే ఎన్కౌంటర్లో... -
ఫోన్ బ్యాటరీల నుంచి100 విషవాయువులు
వాషింగ్టన్: స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు వంటి వాటిలోని బ్యాటరీల నుంచి 100 రకాలకు పైగా ప్రాణాంతక విష వాయువులు వెలువడుతున్నట్లు అధ్యయనంలో తేలింది. లిథియం అయాన్ బ్యాటరీల నుంచి కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువులు వెలువడుతున్నాయని, వీటి వల్ల చర్మ,శ్వాస రోగాలు వచ్చే ప్రమాదముందని, పర్యావరణానికి నష్టం జరుగుతుందని ఎన్బీసీ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్(అమెరికా), చైనాలోని సింఘువా వర్సిటీ(చైనా) పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఏడాదికి 200 కోట్ల చొప్పున వినియోగంలోకి వస్తున్న లిథియం-ఇయాన్ బ్యాటరీలపై పరిశోధన జరిపారు.