స్వచ్ఛ భారతం ఇదేనా?
విశ్లేషణ
స్వచ్ఛ భారత్ ప్రజల తలకెక్కలేదు. వారు వీధులలో చెత్తను వేస్తున్నారు, మూత్ర విసర్జన చేస్తున్నారు. సుగమ్య భారత్‌ను నిజం చేయాల్సిన వారు ప్రచారం తప్ప వికలాంగులకు అనువైన సదుపాయాలను కల్పించడంలేదు.
ప్రశంసనీయమైన లక్ష్యాలతో దేశంలో ప్రస్తుతం రెండు ఉద్య మాలు సాగుతున్నాయి. ఒకటి స్వచ్ఛ భారత్ కార్యక్రమం. రెండవది, రైలు, బస్సు స్టేషన్లు, భవనాలు తదితరా లను వికలాంగులకు అందు బాటులోకి తేవడానికి ఉద్దేశిం చిన సుగమ్య భారత్. వాటిపై భారీ ప్రచారం సాగుతోంది. శుద్ధి ప్రణా ళికకు 2019 తుది గడువు. ఆలోగా ఎక్కడబడితే అక్కడ కనిపించే చెత్తనంతా తొలగించి దేశాన్ని పరిశుభ్రం చేయాల్సిఉంది. ప్రతి ఒక్కరూ, పౌరులు, అధికారులు అందుకు పూనుకుని వ్యక్తిగత ఆరోగ్యం, ప్రజారోగ్యం వంటి ప్రయోజనాలను పొం దాల్సి ఉంటుంది. ఇక వికలాంగులంతా వారికి కల్పిం చిన సదుపాయాలను వాడుకుంటూ ఉండాలి. అలా జరుగుతుంటే చాలా చక్కగా ఉంటుంది.
కానీ ప్రజలు పరిశుభ్రతను బలవంతంగా రుద్దగలి గేది కాదని, అలవ రచుకోవాల్సినదని ఇంకా గుర్తిం చలేక పోవడం వల్ల ఈ రెండు లక్ష్యాలు నెరవేరడమూ కష్టమే. సబ్సిడీల పంపిణీకి అవినీతి క్యాన్సర్ సోకక పోతే, ప్రోత్సాహకాలు మరుగు దొడ్ల నిర్మాణానికి తోడ్ప డతాయి. సుగమ్య భారత్ భావనను నిజం చేయా ల్సిన వారు దాన్ని ప్రచారం చేయడమే తప్ప వికలాం గులకు అనువైన సదుపాయాల నిర్మాణానికి తోడ్పడటం లేదు.
ఒక సాధారణమైన మనిషి తాత్కాలిక వైకల్యానికి గురైతే తప్ప వికలాంగులు అనుభవించే బాధ ఎలాంటిదో తెలియదు. మహారాష్ట్ర ఆర్థిక మంత్రి జయంత్ పాటిల్ ప్రమాదానికి గురై రెండు కాళ్లు విరి గాయి. దీంతో ఆ మంత్రి శాసనసభలోకి ప్రవేశించడా నికి వీలుగా ఒక రాంప్‌ను (వాలు దారి), ట్రెజరీ బెంచ్ కు చేరడానికి మరో రాంప్‌ను ఏర్పాటు చేశారు. సెక్ర టేరియట్‌లో నిరాటంకంగా ఆయన విధులను సాగించ డానికి వీలుగా ఆగమేఘాలపై ఇంకో రాంప్ ప్రత్యక్ష మైంది. రాష్ట్ర ప్రభుత్వ భవనాలను వికలాంగు లకు అను వైనవిగా మార్చడానికి బడ్జెట్లో సంకేతాత్మ కంగానైనా నిధులను కేటాయించడానికి ఆయనను ఒప్పించినట్టు గుర్తుంది. అయినా ఎక్కడా రాంప్లు కనబడటం లేదు. వికలాంగులు బాధలు పడుతూనే ఉన్నారు.
స్వచ్ఛ భారత్ సైతం నరేంద్ర మోదీ ఆశిస్తున్నట్టు విజయవంతం అయ్యేలా సాగడం లేదు. గ్రామాల నుంచి నగరాల వరకు స్థానిక సంస్థలు ఈ పరిశుభ్రతా పరిరక్షణ కృషి, పౌరులను చైతన్యవంతులను చేసే కృషి అభిలషణీయ స్థాయిలో సాగడానికి హామీని కల్పించ డానికి సహాయపడాల్సి ఉంది. అయినా, ఎక్కడో కొద్ది చోట్ల తప్పితే, ఒక నియమం అన్నట్టు ప్రతి చోటా ఈ కృషి తీవ్రంగా కొరవడటమే కనబడుతోంది. అసలు పరిశుభ్రత పట్లనే వ్యక్తులలో, సంస్థలలో పట్టింపు లేనితనం ఉంది. సబ్సిడీల వల్ల మరుగుదొడ్లను నిర్మించి ఉండొచ్చు. కానీ వాటి ఉపయోగం రెండు కారణాల వల్ల అభిలషణీయ స్థాయికన్నా తక్కువగా ఉంటోంది.
ఒకటి, పాత అలవాట్లు అంత తేలికగా వదిలేవి కాకపోవడం. రెండు, వాటిని శుభ్రంగా ఉంచడానికి నీరు కొరవడటం. గణాంకాలను చూస్తే ప్రశంసనీయమైన కృషి జరిగినట్టే అనిపిస్తుంది. కలగాల్సిన ప్రయోజనాలను బట్టి చూస్తే నిర్మించిన మరుగు దొడ్లు అందుకు అనుగుణంగా ఉండ టంలేదు. అదే పెద్ద సమస్య. ఇది కేవలం మరుగు దొడ్లను నిర్మించడానికి సం బంధించిన సమస్య కాదు, వాటిని ఉపయోగించడంలో ప్రజలకు శిక్షణ గరపడమే సమస్య. అయితే మరుగుదొడ్లు లేకపోవడం వల్ల తలెత్తే సమస్యలూ ఉన్నాయి.. బాలికలు మధ్యలోనే చదువు మానుకుంటున్నారు, నగరాలలో మహిళలు ‘మూత్ర విసర్జనా హక్కు’ను కోరుతున్నారు.
ఈ కార్యక్రమం ఇంకా ప్రజల తలకెక్కలేదు. వారు ఆనందంగా వీధులలో చెత్తను వేస్తున్నారు, ఉమ్ముతు న్నారు, మూత్ర విసర్జన చేస్తున్నారు. స్వచ్ఛ భారత్‌ను ప్రారంభించిన ప్రధానే వచ్చి శుభ్రం చేస్తారన్నట్టు వ్యవ హరిస్తున్నారు. ఇదేదో ప్రభుత్వ కార్యకలాపం అన్నట్టు చాలా కార్యక్రమాల్లాగే ఇదీ వారిని తాకలేదు. ఎవరైనా వీధుల్లో ఉమ్మితే లేదా వాడేసిన ఖాళీ గుట్కా ప్యాకెట్‌ను పారేస్తే, సిగరెట్ పీకలను పారేస్తే వారిని ఎగతాళి చేస్తుంటాను. పరిశుభ్రత ఆవశ్యకతను వివారిస్తాను. పరిశుభ్రతకు సంబంధించిన ప్రజా ప్రమాణాలను ఉల్లం ఘించిన వ్యక్తిని అది సిగ్గుపడేలా చేస్తుంది. తేలికగా చేయగలిగేది.. ఉమ్మిన వ్యక్తిని చెప్పులు విప్పి కేవలం అతని కాలిబొటన వేలిని ఉమ్మిన దానిలో లేదా కళ్లెలో పెట్టమనాలి.
‘‘మీరు ఉమ్మినదాన్ని మీరు ఒక్కసారి తాకి చూసి, మరొకరు దాన్ని తాకితే ఎలా ఉంటుందో ఊహిం చండి’’ అంటే సరి. ఆ ఆలోచనే చీదర పుట్టించడం అతని మొహంలో కనిపిస్తుంది, ఈ సుదీర్ఘ ప్రయా ణంలో మనం, ప్రజారోగ్యకర పరిస్థితులకు హామీని కల్పించగలగడంలోనే మనందరి సొంత ప్రయోజనాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తించడం అవసరం. ఇక వికలాంగులకు సదుపాయాలను అందుబాటులోకి తేవడం మనందరి తప్పనిసరి బాధ్యత.
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
- మహేష్ విజాపుర్కార్
ఈ మెయిల్ : mvijapurkar@gmail.com