పిన్నమనేని భార్య మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్ (ఆప్కాబ్) చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు కారు ప్రమాద ఘటనపై వైఎఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
పిన్నమనేని సతీమణి సత్యవాణి, డ్రైవర్ మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపాన్ని తెలిపారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కారుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పిన్నమనేని త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డుపై సోమవారం అర్ధరాత్రి ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.