విశాఖ స్టీలు ప్లాంటులో ప్రమాదం
విశాఖ స్టీల్ ప్లాంటులోని బ్లాస్ట్ ఫర్నేస్-2లో ప్రమాదం సంభవించింది. రెండో బ్లాస్ట్ ఫర్నేస్లో పైపులు పగిలిపోవడంతో ఉక్కు ద్రావకం నేలపాలైంది. ద్రవరూపంలో ఉన్న ఉక్కు బయటకు వస్తోంది. మంటలు వ్యాపిస్తుండటంతో సిబ్బందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు.
అయితే, ద్రవరూప ఉక్కు నేలపాలు కావడంతో కోట్లాది రూపాయల మేర ఆస్తినష్టం సంభవించింది. ఒత్తిడి కారణంగానే పైపులు పగిలి ఉంటాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రమాదం కారణంగా బ్లాస్ట్ ఫర్నేస్ కార్యకలాపాలు మిగిలిపోయాయి.