టిప్పర్‌ను ఢీకొన్న కారు : ఇద్దరికి గాయాలు
దిగమర్రు (పాలకొల్లు అర్బన్) : చించినాడ–దిగమర్రు జాతీయ రహదారిలో దిగమర్రు బస్టాండ్ మలుపు వద్ద బుధవారం చించినాడ వైపు వెళ్తున్న టిప్పర్‌ను పాలకొల్లు వైపు వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ కారులో విదేశీయులు ప్రయాణిస్తున్నారు. విజయవాడ నుంచి బయలుదేరి పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకుని అంతర్వేది వెళ్లి తిరిగి పాలకొల్లు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు నడుపుతున్న విదేశీయుడు చాకచక్యంతో వ్యవహరించడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురూ ప్రాణాలతో బయటపడ్డారు. కారు నడుపుతున్న విదేశీయుని కాలు విరగడంతో ఆయనను వేరే కారులో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. టిప్పర్ ముందుభాగం కూడా దెబ్బతింది. టిప్పర్ డ్రైవర్‌కు స్వల్పగాయాలయ్యాయి. దీనిపై ఎలాంటి కేసూ నమోదు కాలేదని పాలకొల్లు రూరల్ పోలీసులు తెలిపారు.