తిరుమల బాటలో షిరిడి
షిరిడి: పుణ్యక్షేత్రం తిరుమల మాదిరిగా క్యూలు తగ్గించేందుకు షిరిడిలోని సాయి బాబా సంస్థాన్ ట్రస్టు దర్శనం కోరే భక్తుల పేర్ల నమోదును ప్రారంభించనుంది. ‘ప్లాన్ దర్శన్’గా పిలిచే ఈ కార్యక్రమం 3 నెలల్లో ప్రారంభమవుతుందని ట్రస్టు తెలిపింది. డిజిటల్ మీడియా, ఇతర బహిరంగ బుకింగ్ వేదికల ద్వారా భక్తులు తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని పేర్కొంది. వారి సందర్శన సమయాన్ని ట్రస్టు నిర్ణయిస్తుంది.