పెళ్లైన తర్వాతే ఎక్కువ చూస్తున్నారట!
పెళ్లైన మగాళ్లు శృంగార చిత్రాలు చూడడానికి అంత ఆసక్తి చూపరని తాజా అధ్యయం వెల్లడించింది. పెళ్లైన తర్వాత మగాళ్లు పోర్న్ తక్కువగా చూస్తున్నారని, మహిళలు ఎక్కువగా పోర్న్ వెబ్ సైట్లు చూస్తున్నారట. వివాహానికి ముందు, తర్వాత స్త్రీపురుషుల్లో ప్రవర్తనల్లో వచ్చిన మార్పులను అధ్యయం చేసి ఈ నిర్ణయానికి వచ్చారు. ఈ అధ్యయనం కోసం 100 మంది వివాహితులను ఇంటర్వ్యూ చేశారు.
పెళ్లికి ముందు పోర్న్ చూసేవాళ్లమని 9 శాతం, పెళ్లైన తర్వాత పోర్న్ వీక్షిస్తున్నామని 28 శాతం మంది మహిళలు వెల్లడించారు. మ్యారేజ్ కు ముందు పోర్న్ చూసే మగవాళ్లు 23 శాతం ఉండగా, పెళ్లైన తర్వాత ఈ సంఖ్య 14 శాతంగా ఉంది. లైంగిక విషయాల్లో స్త్రీపురుషుల ఆలోచనా ధోరణి భిన్నంగా ఉందనేందుకు అధ్యయన ఫలితాలు అద్దం పడుతున్నాయని సర్వేకు నేతృత్వం వహించిన ప్లానెటరీ సైంటిస్ట్ స్టీవ్ వాన్స్ పేర్కొన్నారు.