Planetary Society
-
సూర్యగ్రహణం నేడే
న్యూఢిల్లీ: ఆకాశంలో అద్భుత దృశ్యమైన సూర్యగ్రహణాల్లో ఒకటైన వార్షిక సూర్యగ్రహణం ఆదివారం భారత్‌లో కనిపించి కనువిందు చేయనుంది. ఈ సూర్యగ్రహణం సమయంలో చంద్రుడు భూమికి సుదూరంగా వెళ్లడంతో పూర్తిగా సూర్యుడ్ని కప్పి ఉంచలేడు. 70శాతం మాత్రమే కప్పివేయడంతో ఖగోళ అద్భుత దృశ్యాల్లో ఒకటైన రింగ్ ఆఫ్ ఫైర్ కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా తీసుకుంటే సూర్యగ్రహణం ఉదయం గం.9:15 గంటలకు మొదలై మధ్యాహ్నం 12:10 గంటలకు అత్యున్నత స్థితికి చేరుకొని మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది. అయితే ప్రాంతాలను బట్టి సమయంలో కాస్త మార్పులు ఉంటాయని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. గ్రహణం తెలంగాణలో ఉదయం 10.15 గంటల నుంచి 1.44 గంటల వరకు ఉంటుంది. 51 శాతం గ్రహణం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 10.21 గంటల నుంచి మధ్యాహ్నం 1.49 గంటల వరకు 46 శాతం గ్రహణం ఉంటుంది. విశ్వ వ్యాప్తంగా 3గంటల 33 నిమిషాలపాటు గ్రహణం ఉంటుంది. హైదరాబాద్‌లో పాక్షికంగా పూర్తిస్థాయి వలయాకార సూర్యగ్రహణం విశ్వవ్యాప్తంగా ఉదయం 9.16 గంటల నుంచి మధ్యాహ్నం 3.04 వరకు ఉంటుంది. భారత్‌లో గుజరాత్లో మొదట గ్రహణం కనిపిస్తుంది. హైదరాబాద్‌లో పాక్షికంగా కనిపించనుంది. సూర్యగ్రహణం వేళ అతినీలలోహిత కిరణాలు భూమి మీద పడినపుడు కరోనా వైరస్ 0.001 శాతం మాత్రమే చనిపోయే అవకాశముంది. ► 2020లో సంభవించే రెండు సూర్యగ్రహణాల్లో ఇది మొదటిది. ఇది పాక్షిక సూర్య గ్రహణమే. డిసెంబర్ 14న ఏర్పడబోయేది సంపూర్ణ సూర్యగ్రహణం. ► దేశంలో గుజరాత్‌లోని భుజ్‌లో మొదట కనిపిస్తుందని, అస్సాంలోని దిబ్రూగఢ్‌లో చివరిగా మధ్యాహ్నం 2:29 గంటలకు పూర్తవుతుందని నెహ్రూ ప్లానెటోరియంలోని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ► ఇవాళ్టి వార్షిక సూర్యగ్రహణంలో ఆకాశంలో అద్భుత దృశ్యమైన రింగ్ ఆఫ్ ఫైర్ కనువిందు చేయనుంది. రాజస్తాన్, హరియాణా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ప్రజలు దీనిని వీక్షించవచ్చును. ► రాజస్తాన్‌లో సూరత్‌గఢ్, అనూప్‌గఢ్, హరియాణాలో సిర్సా, రాటియా, కురుక్షేత్రలోనూ, ఉత్తరాఖండ్‌లో డెహ్రాడూన్, చంబా, చమోలిŠ‡లో రింగ్ ఆఫ్ ఫైర్ ఒక్కనిమిషం వరకు కనిపిస్తుంది. ► సెంట్రల్ ఆఫ్రికా, పాకిస్తాన్, దక్షిణ సెంట్రల్ చైనా, యూరప్‌లో కొన్ని ప్రాంతాలు, ఆస్ట్రేలియాలోనూ సూర్యగ్రహణం కనిపిస్తుంది. ► సూర్యగ్రహణాన్ని నేరుగా చూస్తే మనిషి కంటిలో రెటీనా దెబ్బ తింటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తగినన్ని రక్షణ జాగ్రత్తలతో ఫిల్టర్ కళ్లద్దాలు ధరించిన తర్వాతే రింగ్ ఆఫ్ ఫైర్ దృశ్యాన్ని చూడొచ్చు. – రఘునందన్, ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా -
రేపు అద్భుత ఖగోళ సంఘటన
సాక్షి, హైదరాబాద్ : రేపు(ఆదివారం) అద్భుత ఖగోళ సంఘటన జరగబోతోందని ప్లానిటరీ సొసైటీ సైంటిస్ట్ రఘునందన్ అన్నారు. పూర్తి స్థాయి వలయాకార సూర్య గ్రహణం జరుగుతుందని తెలిపారు. విశ్వవ్యాప్తంగా ఉదయం 9.16 నుండి మధ్యాహ్నం 3.04 వరకు సూర్య గ్రహణం ఉంటుందని వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మన దేశంలో గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకలో ఈ గ్రహణాన్ని మొదట చూస్తారు. కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా కనపడుతుంది. మామూలుగా సూర్యుని కిరణాలు నేరుగా భూమిపై పడతాయి. కానీ రేపు గ్రహణం కారణంగా అతినీలలోహిత కిరణాలు భూమి మీద పడతాయి. కాబట్టి కరోనా 0.001 శాతం చనిపోయే అవకాశం ఉంది. 100 శాతం అంతం కాదు. తెలంగాణలో సూర్యగ్రహణం రేపు ఉదయం 10.15 గంటల నుండి 1.44 గంటల వరకు 51 శాతం గ్రహణం ఉంటుంది. ( 21న ‘రింగ్ ఆఫ్ ఫైర్’ ) ఆంద్రప్రదేశ్‌లో ఉదయం 10.21 గంటల నుండి మధ్యాహ్నం 1.49 గంటల వరకు 46 శాతం ఉంటుంది. గ్రహణం సమయంలో తినకూడదు, గర్భిణీ స్త్రీలు బయటకు రాకూడదంటూ ప్రచారం చేస్తున్నారు. కొందరు నరబలి ఇవ్వాలని చూస్తుంటారు. గతంలో హైదరాబాద్‌లో ఒక అమ్మాయిని కూడా నరబలి ఇచ్చారు. అవన్నీ మూఢనమ్మకాలు అలాంటి వాటిని నమ్మకూడదు. సూర్యుని ద్వారా కరోనా వచ్చింది అని ప్రచారం జరుగుతుంది. రేపటి గ్రహణంతో కరోనా అంతం అవుతుందని అంటున్నారు. అది అవాస్తవం’’ అని తెలిపారు. -
అక్కడ మరో ఇద్దరు చంద్రుళ్లు..!
భూ గ్రహానికి ఒక ఉపగ్రహం మాత్రమే ఉందనీ.. అది చంద్రుడనీ అందరికీ తెలుసు. మనం అనుకుంటున్నట్టు భూమికి చంద్రుడితో పాటు మరో రెండు ఉపగ్రహాలున్నాయనీ హంగేరీకి చెందిన ఆస్ట్రనామర్లు, భౌతిక శాస్త్రవేత్తలు తేల్చారు. దట్టమైన దుమ్మూ, ధూళితో కూడిన చంద్రుని వంటి నిర్మితాలు రెండు భూమికి ఉపగ్రహాలుగా ఉన్నాయనే ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వారు వెల్లడించారు. దీంతో 50 ఏళ్ల క్రితం మొదలైన ‘చంద్ర పరిశోధన’ లకు ఫలితం దక్కినట్టయింది. కాగా, రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీ ఈ పరిశోధనలపై కథనం ప్రచురించింది. దాని ప్రకారం.. భూమికి ఉపగ్రహాలుగా మరో రెండు చంద్రుళ్లున్నాయని నిరూపించేందుకు అవసరమైన డేటా హంగేరీయన్ శాస్త్రవేత్తల వద్ద ఉంది. దుమ్మూ, ధూళితో నిర్మితమైయున్న ఈ పదార్థాలు భూమి కంటే 9 రెట్లు వెడల్పుగా ఉంటాయని వెల్లడైంది. అనగా ఈ నిర్మితాలు భూమికంటే 45 వేల నుంచి 65 వేల మైళ్ల వెడల్పుంటాయి. కొన్ని ముఖ్య విషయాలు.. చంద్రుణ్ని పోలిన నిర్మాణాలు అంతరిక్షంలో ఉన్నాయనీ, అవి భూమి చుట్టూ తిరుగుతున్నాయనే అంచనాలు 1961లోనే మొదలయ్యాయి. పోలండ్‌కు చెందిన ఆస్ట్రనామర్ కజిమియర్జ్ కార్డ్లీస్కీ దుమ్మూధూళితో కూడిన చంద్రుణ్ని పోలిన నిర్మాణాలు ఉన్నాయని గుర్తించారు. ఈయన పేరుమీదనే వాటిని కార్డ్లీస్కీ మేఘాలుగా పిలుస్తున్నాం. కాగా, తాజాగా వెలుగుచూసిన కార్డ్లీస్కీ మేఘాలు తేలికపాటి దుమ్ము, ధూళి అణువులతో నిర్మితమై ఉన్నందున పెద్దగా బరువుండవు. కానీ, సూర్యకిరణాలు ఈ మేఘాలపై పడినప్పుడు అవి కాంతిమయమవుతాయని రాయల్ సొసైటీ తెలిపింది. ఈ నిర్మితాలు చంద్రుని కన్నా భూమికి దగ్గరగా ఉన్నా.. సూర్యుడు, నక్షత్రాలు, అంతరిక్ష వెలుతుర్ల కారణంగా మనకు కనిపించడం లేదని ఈ రిపోర్టు వెల్లడించింది. కార్డ్లీస్కీ మేఘాలు తరచూ మార్పులకు లోనవుతాయి. ఇవి ఒకే క్షక్ష్యలో తిరుగుతూ వేల సంవత్సరాలు ఉనికిలో ఉంటాయి. అయితే తేలికపాటి పదార్థాలతో నిర్మితమైనందున వాటిలో అంతర్గంతంగా ఉన్న అణువులు ఒకదాన్నొకటి రాసుకూంటూ ఉంటాయని కథనం ప్రచురించింది. కాగా, కార్డ్లీస్కీ మేఘాలు అంతరిక్ష ప్రయోగాలకు ఉపకరిస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. -
సూపర్ మూన్
సిటీలో సూపర్ మూన్ దృశ్యాన్ని చిన్నారులు ఆనందంగా వీక్షించారు. ప్లానెటరీ సొసైటీ ఇండియా, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం నెక్లెస్‌రోడ్ సంజీవయ్య పార్కులోని ఎత్తైన జాతీయ జెండా వద్ద వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు సూపర్ మూన్‌ను వీక్షింప చేశారు. ప్లానెటరీ సొసైటీ ఇండియా డెరైక్టర్ రఘునందన్ కుమార్, టీఎస్సీవోఎస్టీ మెంబర్ సెక్రటరీ నాగేష్ కుమార్‌లు మాట్లాడుతూ చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చి 14శాతం పెద్దగా, 30శాతం కాంతివంతంగా కనిపించే అరుదైన రోజని తెలిపారు. -రాంగోపాల్‌పేట్