ఇంటింటికీ ఉచితంగా మొక్కల సరఫరా
ఎవరైనా కోరితే ఇంటింటికీ ఉచితంగా మొక్కలు సరఫరా చేస్తానని నృత్యదర్శకుడు, నటుడు, దర్శకుడు లారెన్స్ తెలిపారు.సేవా కార్యక్రమాలకు ముందుండే ఈయన తాజాగా సమాజానికి ప్రయోజనం చేకూర్చే మరో బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇటీవల వర్దా తుపా¯ŒS తమిళనాడును అతలాకుతలం చేసింది. లక్షలకు పైగా తరతరాలకు చెందిన వటవృక్షాలను వేళ్లతో సహా పెకలించి వేసింది. మరో పక్క నీటి ఎద్దడితో ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు.
దీంతో వృక్షసంపదను పెంచే ప్రయత్నానికి నటుడు లారెన్స్ నడుంబిగించారు. తన ట్రస్ట్ ద్వారా గురువారం నుంచి చెన్నై నగరంలో మొక్కలు నాటడానికి సన్నద్ధం అవుతున్నారు. అదే విధంగా ఎవరైనా మొక్కలు కావాలని కోరితే వారి ఇంటికి వెళ్లి ఉచితంగా మొక్కలను అందిస్తానని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో లారెన్స్ పేర్కొన్నారు.