Players support
-
స్పోర్ట్స్ ఎంటర్ప్రెన్యూర్! ఆటకు సాంకేతికతను జోడించి..
ఆటలు, సాంకేతిక పరిజ్ఞానం వేరు వేరు విషయాలు కాదు. సాంకేతికత సహాయంతో ఆటల్లో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు... అనే లక్ష్యంతో హరియాణాలోని గురుగ్రామ్ కేంద్రంగా ‘స్తూప స్టోర్స్ ఎనలటిక్స్’ అనే స్టార్టప్‌కు శ్రీకారం చుట్టి విజయపథంలో దూసుకుపోతోంది మేఘా గంభీర్. ఎలాంటి ప్లాన్ లేకుండానే పెద్ద కార్పొరేట్ కంపెనీలో తాను చేస్తున్న ఉద్యోగానికి గుడ్‌బై చెప్పింది మేఘా గంభీర్. అదే సమయంలో ఆమె భర్త, టేబుల్ టెన్నిస్ కోచ్ దీపక్ మాలిక్ ‘టెక్నాలజీ సహాయంతో ట్రైనీల పెర్ఫార్మెన్స్ను ఎలా మెరుగుపరచవచ్చు...’ అనే అంశంపై ఆలోచిస్తున్నాడు. మేఘకు వెంటనే స్టార్టప్ ఐడియా తట్టింది. డేటా, ఎనలటిక్స్ సహాయంతో ప్లేయర్స్ తమ ఆటతీరును మెరుగు పరుచుకోవడానికి రెండు సంవత్సరాల క్రితం ‘స్తూప స్పోర్ట్స్ ఎనలటిక్స్’ అనే స్టార్టప్‌కు శ్రీకారం చుట్టింది. దీనికిముందు అమెరికన్ ఎక్స్‌ప్రెస్, పెప్సికో... మొదలైన కంపెనీలలో పదిహేను సంవత్సరాల పాటు టెక్ కన్సల్టెంట్, ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేసింది. మేఘకు ఆటలు అంటే చాలా ఇష్టం. బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా. ఆటలలో నిపుణుౖలైన ఎంతోమందితో మాట్లాడిన తరువాత తన స్టార్టప్ ఐడియాను పట్టాలకెక్కించింది. డేటాను కాప్చర్ చేసే ఆటోమేటెడ్ ఇంజిన్‌ను తయారు చేయడానికి సంవత్సరానికి పైగా టైమ్ పట్టింది. ఆటలో ప్రతి కోణాన్ని విశ్లేషించుకునేలా కోర్టులో 8–10 కెమెరా సెటప్‌కు రూపకల్పన చేశారు. కంపెనీకి సంబంధించి ప్రత్యేక టెక్నాలజీకి పేటెంట్ కూడా తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కంపెనీకి పదిహేనుకు పైగా గ్లోబల్ క్లయింట్స్ ఉన్నారు. ‘టెక్నాలజీ వైపు నుంచి స్పోర్ట్స్ ఎనలటిక్స్ వైపు మేఘ రావడానికి కారణం ఏమిటి?’ జవాబు ఆమె మాటల్లోనే... ‘ఒక పెద్ద కంపెనీలో పెద్ద జీతంతో పనిచేస్తున్నప్పటికీ నేను చేస్తున్న ఉద్యోగంతో సంతోషంతో లేను. ఉద్యోగం కాకుండా నెక్ట్స్ ఏమిటి... అని ఆలోచించడానికి గ్యాప్ తీసుకోవాలనుకున్నాను. ఆ సమయంలో నా భర్త వల్ల స్టార్టప్ ఆలోచన వచ్చింది. స్పోర్ట్స్ సైన్స్ కాంగ్రెస్‌లో నా కాన్సెప్ట్‌ను ప్రెజెంట్ చేస్తే మంచి స్పందన వచ్చింది. జూనియర్స్, యూత్, సీనియర్స్... ఇలా రకరకాల విభాగాలు ఆటలో ఉంటాయి. ప్రతి మ్యాచ్‌కు, ప్రతి ప్లేయర్‌కు సంబంధించిన సమాచారాన్ని కాప్చర్ చేయడం కోచ్‌లకు కష్టం అవుతుంది. ట్రైనింగ్ సెషన్స్ ప్రారంభించడానికి వారి దగ్గర తగిన సమాచారం ఉండాలి. ఒక ప్లేయర్ టోర్నమెంట్‌కు సంబంధించి అయిదు లేదా పది మ్యాచ్‌లు చూడాల్సి వస్తే డేటా రాయడానికి రెండు మూడు వారాల సమయం పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్లేయర్స్ పెర్ఫార్మెన్స్ ఎనలటిక్స్కు ఉపయోగపడే ఏఐ ప్రాడక్ట్‌ను తీసుకువచ్చాం. దీనిద్వారా ప్లేయర్స్ తమ మ్యాచ్ వీడియోలను అప్లోడ్ చేసి విశ్లేషణ రిపోర్ట్‌ను తీసుకోవచ్చు. ఇదే సమయంలో కామెంటర్స్కు ఉపయోగపడే ఏఐ ప్రాడక్ట్స్ రూపొందించాం. టేబుల్ టెన్నిస్‌తో మొదలుపెట్టాం. బ్యాడ్మింటన్లాంటి ఇతర ఆటల్లోకి కూడా విస్తరించే ప్రణాళికలతో ఉన్నాం’ అంటుంది మేఘా గంభీర్. నాణ్యతతో కూడిన వర్చువల్ కోచింగ్, ప్లేయర్స్‌కు ఉపయోగపడే సెన్సర్–బేస్డ్ టెక్నాలజీపై ప్రత్యేక కృష్టి పెట్టింది కంపెనీ. యూరప్ మార్కెట్లో పట్టు సంపాదించిన ‘స్తూప’ ఆసియా, యూఎస్ మార్కెట్లోకి కూడా విస్తరించడానికి తగిన ప్రణాళికలు రూపొందించుకుంది. ‘మహిళా స్పోర్ట్స్ ఎంటర్ప్రెన్యూర్లు తక్కువగా కనిపిస్తారు. చాలామంది లైఫ్‌స్టైల్, ఫ్యాషన్, ఫుడ్‌లాంటి రంగాలను ఎంపిక చేసుకుంటారు. స్పోర్ట్స్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా నేను విజయం సాధించడానికి కారణం చక్కని సలహాలు ఇచ్చిన అనుభవజ్ఞులు, విషయ నిపుణులు, ప్లేయర్స్, కోచ్‌ల నుంచి తీసుకున్న ఫీడ్‌బ్యాక్’ అంటుంది మేఘా గంభీర్. (చదవండి: ఈ 'వెడ్డూరం' చూశారా? పెళ్లిని సొమ్ము చేసుకునే ట్రెండ్! వెడ్డింగ్ విత్ టికెట్!) -
సానుభూతి!
స్టీవ్ స్మిత్ మీడియా సమావేశంలో కళ్ళనీళ్లు పెట్టుకొని భావోద్వేగంగా మాట్లాడిన తర్వాత అతనిపై క్రికెట్ ప్రపంచం నుంచి సానుభూతి కురుస్తోంది. శిక్షల తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉందని వారు అభిప్రాయ పడుతున్నారు. వీరిలో స్మిత్‌తో తలపడిన ప్రత్యర్థులు కూడా ఉండటం విశేషం. విమానాశ్రయంలో స్మిత్‌ను తీసుకొస్తున్న దృశ్యం, అతని మీడియా సమావేశం నన్ను వెంటాడుతున్నాయి. వారు తప్పు చేశారనేది వాస్తవం. కానీ దానిని అంగీకరించారు. వారిద్దరు గొప్ప ఆటగాళ్లు. ఈ ఘటనను బట్టి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం తప్పు. –రోహిత్ శర్మ క్రికెట్‌ను అవినీతి రహితంగా ఉంచాల్సిందే. కానీ స్మిత్, వార్నర్‌లకు వేసిన శిక్ష చాలా పెద్దది. గతంలో జీతాల పెంపు కోసం వీరిద్దరు పోరాడటం వల్లే ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారేమో! ఆటగాళ్ల తరఫున నిలబడిన వారిని పరిపాలకులు అణచివేసిన చరిత్ర ఉంది. నాకు స్మిత్‌లో మోసగాడు కనిపించడం లేదు. తన దేశం కోసం గెలిచేందుకు ప్రయత్నించి నాయకుడే కనిపిస్తున్నాడు. అతను ఎంచుకున్న పద్ధతి తప్పు కావచ్చు కానీ అతడిని అవినీతిపరుడిగా ముద్ర వేయకండి. – గంభీర్ సీఏ విచారణ లోపభూయిష్టంగా జరిగింది. శిక్షలు తీవ్రంగా ఉన్నాయి. ఐసీసీ విధించిన శిక్షలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. గతంలో ఇదే నేరానికి విధించిన శిక్షకు, ఇప్పటిదానికి చాలా చాలా వ్యత్యాసం ఉంది. ముందూ వెనక ఆలోచించకుండా ఆటగాళ్లను ఘటన జరిగిన రోజు మీడియా ముందు ప్రవేశపెట్టడమే పెద్ద తప్పు. క్రికెటర్లకు మేం నైతిక మద్దతుతో పాటు న్యాయపరంగా కూడా సహకరిస్తాం. – ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ అసోసియేషన్ వారు తాము చేసిన పనికి బాధపడటంతో పాటు పశ్చాత్తాపం చెందుతున్నారు. తమ చర్య ద్వారా జరగబోయే తదనంతర పరిణామాలను ఎదుర్కోక తప్పదు. ఇలాంటి సమయంలో వారి కుటుంబ సభ్యులు అండగా నిలవడం ఎంతో ముఖ్యం. ఇక మనం దాని గురించి చర్చించడం మాని పక్కకు తప్పుకొని వారికి కాస్త ఏకాంతం కల్పిస్తే బాగుంటుంది. – సచిన్ టెండూల్కర్ స్మిత్‌ను చూస్తే చాలా బాధగా ఉంది. అతడిని ఇలాంటి స్థితిలో చూడలేం. రాబోయే రోజులు చాలా కఠినంగా గడుస్తాయి. మానసికంగా దృఢంగా ఉండమని నేను మెసేజ్ పంపించాను కూడా. మా ఇద్దరికీ పరస్పర గౌరవం ఉంది. ఆస్ట్రేలియాకు అతను అత్యుత్తమ కెప్టెన్. – ఫాఫ్ డు ప్లెసిస్ వార్నర్ చెడ్డవాడు కాదు. నేను అతనికి ప్రత్యర్థిగా, ఐపీఎల్లో అతనితో కలిసి ఆడాను. ఘటన జరిగిన తర్వాత కూడా మేం టచ్‌లోనే ఉన్నాం. ప్రజల భావోద్వేగాల వల్లే భారీ శిక్ష పడింది తప్ప అతను తప్పుడు మనిషి మాత్రం కాదు. – కేన్ విలియమ్సన్ మంచివాళ్లు కూడా తప్పులు చేస్తారు – నాకు తెలిసి స్మిత్, బాన్‌క్రాఫ్ట్ కొద్ది క్షణాలు మతి తప్పారంతే. వారికి రెండో అవకాశం ఇవ్వాలి. చుట్టుపక్కల ఉన్నవారు అండగా నిలవాలి. – మైకేల్ వాన్ స్మిత్ ఒక మగాడిలా తాను చేసిన తప్పును ఒప్పుకున్నాడు. కానీ అతని ఏడుపు, కొందరు అతనితో వ్యవహరిస్తున్న తీరు చూస్తే చాలా బాధేస్తోంది. – షోయబ్ అక్తర్ ఇప్పుడు జనం కళ్లు చల్లబడ్డాయా... స్మిత్ మాట్లాడుతుంటే చూడలేకపోతున్నాను. – ఆండ్రూ ఫ్లింటాఫ్ -
ఆనంద్ అమృత్‌రాజ్‌కు ఆటగాళ్ల మద్దతు
కెప్టెన్, కోచ్‌లను కొనసాగించాలని ‘ఐటా’కు లేఖ న్యూఢిల్లీ: క్రమశిక్షణా చర్యల కింద భారత డేవిస్ కప్ కెప్టెన్ ఆనంద్ అమృత్‌రాజ్‌పై అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) వేటు వేయాలని భావిస్తోంది. అయితే ఈ నిర్ణయంతో టెన్నిస్ ఆటగాళ్లు మాత్రం పూర్తిగా విభేదిస్తున్నారు. ఈ విషయంలో అమృత్‌రాజ్‌కు పూర్తి మద్దతు ప్రకటిస్తూ ‘ఐటా’కు లేఖ రాశారు. జట్టు సహాయక సిబ్బందిలో ఎలాంటి మార్పులు చేయవద్దని సూచించారు. అమృత్రాజ్తో పాటు కోచ్ జీషన్ అలీ ఒప్పందాలు ఈ నెలాఖరుతో ముగియనున్నాయి. అరుుతే ఆనంద్ అమృత్‌రాజ్‌ను కొనసాగించేందుకు ‘ఐటా’ సుముఖంగా లేదు. ‘భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఆనంద్‌ను కెప్టెన్‌గా, అలీని కోచ్‌గా ఉంచాలని మేము ‘ఐటా’ను కోరుతున్నాం. జట్టులో వారు మంచి వాతావరణాన్ని సృష్టించారు. మూడేళ్ల నుంచి జట్టు వరల్డ్ గ్రూప్ ప్లేఆఫ్‌కు చేరింది. అందుకే జట్టులో ఎలాంటి మార్పులు చేయవద్దు’ అని సోమ్‌దేవ్, యూకీ, సాకేత్, రామ్‌కుమార్ ‘ఐటా’కు విజ్ఞప్తి చేశారు.