pleasure
-
యువతలో పెరుగుతున్న హైపర్ టెన్షన్
లబ్బీపేట (విజయవాడ తూర్పు): హైపర్ టెన్షన్ (బ్లడ్ ప్రెజర్).. యువత గుండెలను సైలెంట్‌గా పట్టేస్తోంది. మూత్రపిండాల పనితీరును దెబ్బతీస్తోంది. పక్షవాతంతో పాటు జ్ఞాపకశక్తి సన్నగిల్లేలా చేస్తోంది. క్యాన్సర్లకూ కారణం అవుతోంది. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లతో చిన్న వయసులోనే హైపర్‌టెన్షన్ బారిన పడుతున్న వారి సంఖ్య అధికమవుతోంది. ఈ నేపథ్యంలో రక్తపోటుతో బాధపడుతున్న వారిని గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. దానికి తోడు కుటుంబ డాక్టర్ కార్యక్రమంలో సైతం దీనికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రత్యేక కార్యక్రమం ఇలా... ఇండియా హైపర్ టెన్షన్ కంట్రోల్ ఇనిషియేటివ్ కార్యక్రమంలో భాగంగా రక్తపోటు బాధితులను గుర్తించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మూడేళ్ల క్రితం ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. తొలుత ఉమ్మడి కృష్ణాను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టగా.. అనంతరం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో రక్తపోటుపై విస్తృతంగా అవగాహన కలిగిస్తున్నారు. రక్తపోటు ఉన్న వారిని గుర్తించి వారికి సరైన చికిత్స అందేలా చూడటం ఈ కార్యక్రమం ఉద్దేశ్యం. పట్టణ ప్రజలు ఎక్కువగా రక్తపోటుకు గురవుతున్నట్టు గుర్తించిన ప్రభుత్వం తొలుత పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో అమలు చేసింది. ప్రస్తుతం జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలు సీహెచ్‌సీల్లో అమలు చేస్తున్నారు. వరంలా మారిన వెల్నెస్ సెంటర్లు.. ఒకప్పుడు రక్తపోటును పరీక్షించుకోవాలంటే గ్రామీణులు దూర ప్రాంతంలో ఉన్న ఆస్పత్రులకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు వారి ఇంటి సమీç³ంలోనే వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లు (వెల్నెస్ సెంటర్స్) అందుబాటులోకి వచ్చాయి. దీంతో బీపీ చెక్ చేయించుకునేందుకు ఎప్పుడైనా వెళ్లవచ్చు. అంతేకాదు రక్తపోటు ఉందని నిర్ధారణ అయితే కుటుంబ డాక్టర్ కార్యక్రమంలో భాగంగా నెలలో రెండుసార్లు వారి గ్రామానికే వస్తున్న వైద్యులతో పరీక్షలు చేయించుకుని మందులు వాడుతున్నారు. దీంతో గ్రామీణులు రక్తపోటును అదుపులో ఉంచుకునే అవకాశం లభించింది. పట్టణ వాసులు సమీపంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఎప్పుడైనా వెళ్లి పరీక్ష చేయించుకుని మందులు వాడుకోవచ్చు. రక్తపోటుకు కారణాలివే.. ♦ జీవన శైలిలో మార్పులు, మాంసాహారం, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్స్ తీసుకోవడం. ♦ శారీరక శ్రమ లేక పోవడం, ఆహారంలో ఉప్పు అధికంగా తీసుకోవడం రక్తపోటు పెరగడానికి కారణంగా చెబుతున్నారు. ♦ ఇటీవల 30 ఏళ్ల వయసు వారు కూడా తీవ్రమైన రక్తపోటుతో బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటుకు గురైన సందర్భాలు ఉన్నట్టు వైద్యులు చెపుతున్నారు. అదుపులో ఉండాలంటే... ♦ రక్తపోటు అదుపులో ఉండాలంటే ప్రతిరోజూ 45 నిమిషాల చొప్పున వారంలో ఐదు రోజులు వ్యాయామం, వాకింగ్ లాంటివి తప్పక చేయాలి. ♦ ఒత్తిళ్లను అధిగమించేందుకు యోగా చేయడం మంచిది. ♦ ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ♦ ప్రతి మనిషి నెలలో 500 గ్రాములకు మించి వంట నూనెలు వాడరాదు. అధికంగా నూనెలు వినియోగించడం చాలా ప్రమాదకరం ♦ ఒకే నూనె కాకుండా మార్చి మార్చి వాడటం మంచిది. సద్వినియోగం చేసుకోండి ఇప్పుడు వైద్యం గ్రామాలకే వెళ్లి అందిస్తున్నందుకు ప్రతి ఒక్కరూ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. కుటుంబ డాక్టర్ కార్యక్రమంలో రక్తపోటును పరీక్షించి మందులు అందచేస్తున్నాం. విలేజ్ హెల్త్ క్లినిక్స్‌లో ఉంటే ఎంఎల్‌హెచ్‌పీల వద్ద బీపీ పరీక్షించుకోవచ్చు.రక్తపోటును అదుపులో ఉంచుకోకుంటే ఇతర అవయవాలపై ప్రభావం చూపుతుంది. రక్తపోటుపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కలిగిస్తున్నాం. – డాక్టర్ మాచర్ల సుహాసిని, డీఎంహెచ్‌వో, ఎన్టీఆర్ జిల్లా -
తెలివైన వారు ఎవరంటే..?
జీవన వికాసం శ్రీశ్రీ రవిశంకర్ వ్యవస్థాపకులు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్ర: సమాజంలో ఇన్ని దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి. వీటిని నివారించలేమా? శ్రీశ్రీ రవిశంకర్: సమాజంలో ఇన్ని దుఃఖాలు ఎందుకు ఉన్నాయి? ఆనందంగా లేకపోవటం వలన. ఆనందంగా ఉన్న మనిషి పనిగట్టుకుని ఎవరినీ కదిలించటం, గొడవలు పెట్టుకోవటం చేయడు. ఆనందంగా ఉన్న వ్యక్తి కేవలం ఆనందాన్నే పంచుతాడు. ఆనందంగా లేనివారే ఈ సమాజంలో మరింత దుఃఖాన్ని సృష్టిస్తున్నారు. మనం సమాజానికి ఆనందాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. జ్ఞానం లేకుండా, తెలివి లేకుండా ఆనందం ఉండలేదు. అయితే మన ఆలోచనా విధానంలో, మన దృక్పథంలో, మన సమాజంలో మార్పు తేవటం అవసరం. ఆధ్యాత్మికత ఆ మార్పుకు ఆధారం కాగలదు. నేరస్తుల దృక్పథం సైతం మార్చబడుతుంది. ఎందుకంటే ప్రతీ మనిషి అంతరంగంలోనూ సౌందర్యం, ఆనందం ఉంటుంది. మనం దానిని తట్టిలేపితే చాలు, వారిలోపల ఉన్న శక్తిసంపద పైకి ఉబికివస్తుంది. అప్పుడిక అన్ని చెడ్డ భావనలను వారు మరచిపోతారు. వాటిని వదిలేస్తారు అంతే. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటాడు, అపి చేత్సుదురాచారో భజతే మాం అనన్యభాక్. సాధరేవ స మన్తవ్యః సమ్యగ్ వ్యవసితో హి సః. ఎంతటి దురాచారాలకు లోబడినవారైనా సరే జ్ఞానంలోకి వచ్చినపుడు, ధ్యానం చేయటానికి సంకల్పించినపుడు, ఆధ్యాత్మికపథంలోకి అడుగిడినపుడు వారిని మనం క్షమించాలి, వారి తప్పులను క్షమించాలి. ఎందుకంటే వారు సరియైన మార్గంలో ప్రయాణం మొదలుపెట్టారు. సంస్కృతంలో ఒక సూక్తి ఉన్నది, కావ్య శాస్త్ర విచారేషు కాలో గచ్ఛతి ధీమతః తెలివైనవారు వారి సమయాన్ని జ్ఞానచర్చలలో, సంగీతం, సాహిత్యం, విజ్ఞానం తెలుసుకోవటంలో, ప్రజలను సమైక్యపరచటంలో గడుపుతారని అర్థం. మూర్ఖులు దీనికి విరుద్ధంగా తమ సమయాన్ని ఎల్లప్పుడూ వ్యసనాలలో, తగాదాలలో, కొట్లాటలలో గడుపుతారు. ఇక్కడ మనలో అనేకమంది తెలివైనవారు ఉన్నారు. తెలివైనవారే ఆధ్యాత్మికం వైపు వస్తారు. ఎవరు తెలివైనవారు? ఎవరిలోనైతే కొంచెం ఆధ్యాత్మికత ఉన్నదో వారే. ఆ కొంచెమూ లేనట్లయితే వారు కళ్ళకు గంతలు కట్టిన గుఱ్ఱ ం వంటివారు. విశాల దృష్టి ఉండదు. వారి జీవితాన్ని వారు చూసుకోలేరు. వారు నిజంగా ఎవరో వారికి తెలియదు. మనకు ఈ జ్ఞానం, సమాజాన్ని మార్చే తెలివి ఉన్నది. ఏదేనా అన్యాయం జరుగుతుండగా మీరు చూశారనుకోండి, ఏం జరుగుతుంది? కోపం వస్తుంది. మీరు కోపంగా ఉన్నపుడు మీరు చేయాలనుకున్నదాన్ని చేయలేరు. ఎందుకంటే మీశక్తిలో చాలాభాగాన్ని కోపం హరించివేస్తుంది. అయితే మీ కోపపు దిశను సృజనాత్మకతవైపు మళ్ళించినపుడు ఎటువంటి పరిస్థితినైనా మీరు మార్చగలరు. మీలో ఆ జ్ఞానం, ఆ శక్తి సంపూర్ణంగా ఉన్నాయి. మీరు ధ్యానం ద్వారా సంపాదించి అంతశ్శక్తి, ఆధ్యాత్మికత పనికివచ్చేది అప్పుడే. శ్రీకృష్ణుని కిరీటంగా నెమలిపింఛం ఎందుకు ఉంటుందో తెలుసా? సాధారణంగా రాజులకు ఉండే కిరీటం చాలా బరువుగా ఉంటుంది. వారి బాధ్యతను అది సూచిస్తూ ఉంటుంది. కిరీటం ధరించినవారు ఏమంత ఆనందంగా ఉండలేరు. అయితే కిరీటంలో నెమలిపింఛం ఉన్నపుడు అది, ఆ కిరీటం తేలికగా ఉన్నదని సూచిస్తూ ఉంటుంది. దాని అర్థం నీవు బాధ్యతను తీసుకోవాలి, అదే సమయంలో నెమలి పింఛంలా తేలికగా, దానిలోని రంగులలా ఉత్సాహభరితంగా ఉండాలి. నీపై ఉంచిన బాధ్యతను ఒక బరువుగా భావించి కుంగిపోవటం లేదు. నీవు జ్ఞానాన్ని కలిగిఉన్నపుడు నీ కిరీటం నెమలి పింఛమంత తేలికగా ఉంటుంది. www.artofliving.org -
అందమె ఆనందం
జలుబు వల్ల ఉదయం నిద్రలేవగానే కళ్ల కింద ఉబ్బుగా కనిపిస్తుంది. ఎండిన చిట్టి చేమంతులను పొడి చేసి, ఆ పొడిని ఒక గుడ్డలో వేసి మూట కట్టాలి. వేడి నీటిలో ఆ మూటను కాసేపు ఉంచి, ఉబ్బుగా ఉన్న కళ్ల కింద మృదువుగా అద్దుతూ (తగినంత మాత్రమే వేడి ఉండేలా జాగ్రత్తపడాలి) ఉండాలి. రోజూ ఉదయాన్నే ఇలా చేస్తే కళ్లకింద ఉబ్బుతో పాటు నల్లని వలయాలు కూడా తగ్గుముఖం పడతాయి. చామంతి పొడితో కాచిన తేనీటిని మాడుకు పట్టించి, తర్వాత తలస్నానం చేస్తే ఎంతకీ తగ్గని చుండ్రు సమస్య పరిష్కారం అవుతుంది. -
హీరో స్ప్లెండర్ ఐస్మార్ట్ : రూ. 47,250
న్యూఢిల్లీ: హీరో మోటోకార్ప్ కంపెనీ అంతా కొత్తదైన స్ప్లెండర్ ఐస్మార్ట్ బైక్‌ను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. ఐ3ఎస్ టెక్నాలజీతో రూపొందించిన ఈ బైక్ ధర రూ.47,250(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) అని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్, సేల్స్) అనిల్ దువా పేర్కొన్నారు. గత నెలలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ఈ బైక్‌ను ప్రదర్శించామని, 100 సీసీ సెగ్మెంట్లో తమ అగ్రస్థానం మరింత పటిష్టం చేసుకోవడం లక్ష్యంగా ఈ బైక్‌ను తెస్తున్నామని పేర్కొన్నారు. ఇతర మోడళ్లలోనూ ఐ3ఎస్ టెక్నాలజీ ఇంటెలిజెంట్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్‌గా వ్యవహరించే ఐ3ఎస్ టెక్నాలజీ కారణంగా ట్రాఫిక్‌లో బండి ఆగగానే ఇంజిన్ ఆటోమాటిక్‌గా ఆఫ్ అయిపోతుందని, క్లచ్ నొక్కగానే స్టార్ట్ అవుతుందని అనిల్ దువా పేర్కొన్నారు. ఫలితంగా ట్రాఫిక్ ఇబ్బందులున్న నగరాల్లో కూడా మంచి మైలేజీ (70 కిమీ మైలేజీ వస్తుందని అంచనా)వస్తుందని వివరించారు. ఈ టెక్నాలజీకి పేటెంట్ కోసం దరఖాస్తు చేశామని, ఇతర బైక్‌ల్లో కూడా ఈ టెక్నాలజీని ఉపయోగిస్తామని వివరించారు. 100-సీసీ ఎయిర్-కూల్డ్, 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో రూపొందిన ఈ బైక్‌లో సూపర్ స్ప్లెండర్‌లో ఉన్న త్రీ-టోన్ పెయింట్ ఆప్షన్, అల్యూమినియంతో కూడిన ఫుట్-పెగ్స్ కొత్త ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సైడ్-స్టాండ్ డౌన్ ఇండికేటర్ వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. చాలా వరకూ స్ప్లెండర్ ఎన్‌ఎక్స్‌జీని పోలిన ఈ బైక్ నాలుగు కొత్త రంగుల్లో లభ్యమవుతుందని వివరించారు. ఈ కంపెనీ గత నెలలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో కొత్త బైక్‌లను ప్రదర్శనకు ఉంచింది. వీటిల్లో 620 సీసీ హస్టర్, 250సీసీ స్పోర్ట్స్ బైక్ హెచ్ఎక్స్ 250ఆర్, హైబ్రిడ్ స్కూటర్ లీప్, 150 సీసీ స్కూటర్ జిర్‌లో రెండు మోడళ్లు, 125 సీసీ డేర్, 110 సీసీ స్కూటర్ డాష్‌లను కూడా ఈ కంపెనీ ఆటో ఎక్స్‌పోలో డిస్ప్లే చేసింది. ఇక ఈ నెలలోనే ప్లెజర్, ఎక్స్ట్రీమ్, జడ్ఎంఆర్ మోడళ్లలో కొత్త వేరియంట్లను అందిస్తామని అనిల్ దువా వెల్లడించారు.