నదిలో పడిన బస్సు, 16 మంది మృతి
లిమా: పెరూలో బస్సు నదిలోకి దూసుకెళ్లడంతో కనీసం 16 మంది ప్రయాణికులు మరణించగా, మరో 10 మంది గాయపడ్డారు. సోమవారం పిచానకి వెళ్లేందుకు ప్రయాణికులను తీసుకెళ్తుండగా పర్వత ప్రాంతంలో ప్రమాదం జరిగింది.
టర్మ నది వద్ద బస్సు పర్వత ప్రాంతంపై వెళ్తుండగా అదుపుతప్పి 35 అడుగుల లోతున ఉన్న నదిలోకి పడిపోయింది. డ్రైవర్ బస్సును వేగంగా నడపడం వల్ల నియంత్రణ కోల్పోయినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు చెప్పారు. పర్వత ప్రాంతాలపై నాసిరకం రోడ్ల కారణంగా పెరూలో ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి.