చెన్నై కార్పొరేషన్‌కు హైకోర్టు హెచ్చరిక
కేకే.నగర్: పురట్చికర మానవర్ ఇయక్కమ్ (పీఎంఈ) తరఫున మద్రాసు హైకోర్టులో కేసు దాఖలయ్యింది. అందులో చెన్నై నగర పరిధిలో ఉన్న 281 కార్పొరేషన్ పాఠశాల్లో కనీస వసతులు, విద్యార్థులకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేరని పిటిషన్లో పేరొన్నారు. కోర్టు దీనిపై ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ కేసును గతంలో విచారించిన న్యాయస్థానం సౌకర్యాల కల్పనకు ఒక కమిటీ వేయాలని కార్పొరేషన్‌ను ఆదేశించింది. మరోసారి ఈ కేసు ప్రధాన న్యాయమూర్తి ఎస్కె గేల్, న్యాయమూర్తి మహదేవన్‌ల సమక్షంలో శుక్రవారం విచారణకు వచ్చింది.
పిటిషన్‌దారుని తరఫున న్యాయవాది పోర్కొడి హాజరై కోర్టు ఆదేశాల ప్రకారం కనీస వసతులు ఏర్పాటు చేయలేదని దీనిపై కార్పొరేషన్‌కు నోటీసులు జారీ చేయాలన్నారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం పాఠశాలల్లో మరుగుదొడ్లు సహా అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని.. దీనిపై నివేదికను సెప్టెంబర్ 2 లోపు కార్డులో దాఖలు చేయాలన్నారు. లేని పక్షంలో అధికారులపై కోర్టు దిక్కారణ కేసుగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. పాఠశాల విద్యా జాయింట్ డైరక్టర్ కోర్టుకు నేరుగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.
కోర్టులో పోలీసుల క్షమాపణలు..
ప్రేమించి మోసం చేసిన కున్నూరు మెజిస్ట్రేట్‌పై మహిళా సబ్ ఇన్స్పెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పల్లడం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మెజిస్ట్రేట్‌ను 2013లో అరెస్టు చేసి జైలుకు తరలించారు. పోలీసు చర్యలలను న్యాయమూర్తుల సంఘం తీవ్రంగా ఖండించింది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తిని అరెస్టు చేసే సమయంలో అనుసరించాల్సిన నిబంధనలను సుప్రంకోర్టు 1991లో తీర్పు ఇచ్చిందన్నారు.
దీన్ని పల్లడం పోలీసులు అనుసరించలేదని సంఘం మండిపడింది. దీంతో మెజిస్ట్రేట్‌ను అరెస్టు చేసిన అప్పటి తిరువూర్ జిల్లా ఎస్పీ పొన్ని, సహాయ పోలీసు సురేష్ కుమార్, పిచ్చైలపై మద్రాసు హైకోర్టులో దిక్కారణ కేసు నమోదయ్యింది. ఈ కేసు ముందుగా న్యాయమూర్తులు పాల్ వసంతకుమార్, సత్యనారాయణన్‌లు విచారించారు. ఆ సమయంలో పోలీసులు నోటి మాటలతో నిబంధన లేని క్షమాపణ కోరారు. వాటిని ప్రమాణ పత్రాలుగా దాఖలు చేయాలని న్యాయమూర్తులు ఆదేశించగా దాన్ని వారు అంగీకరించలేదు.
దీంతో వారిపై కోర్టు దిక్కారణ కేసు నమోదు చేసి విచారణ జరిపారు. ఈ క్రమంలో పాల్ వసంతకుమార్ జమ్మూకాశ్మీర్‌కు బదిలీ అయ్యారు. అయితే మెజిస్ట్రేట్‌ను అరెస్టు చేసిన సమయంలో ఈ విషయాన్ని పోలీసు కమిషనర్లకు, జిల్లా ఎస్పీలకు డీ జీపీ సర్కులర్ పంపినట్లు చెపుతూ ఆ సర్కులర్‌ను కోర్టులో శుక్రవారం దాఖలు చేశారు. దీంతో కేసు విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.