బాబాయ్‌తో ఢీ అంటున్న జూనియర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ 'నాన్నకు ప్రేమతో'. తారక్ డిఫరెంట్ లుక్‌తో కనిపిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ దర్శకుడు. 90 శాతానికి పైగా విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బి వి ఎస్ ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
సినిమా షూటింగ్ మొదలైన సమయంలోనే 'నాన్నకు ప్రేమతో' సినిమాను 2016 సంక్రాంతికి రిలీజ్ చేస్తాం అంటూ ప్రకటించిన చిత్రయూనిట్, అదే సమయంలో బాలయ్య హీరోగా నటిస్తున్న 'డిక్టేటర్' కూడా రిలీజ్ అవుతుండటంతో ఆలోచనలో పడింది. అంతేకాదు బాలయ్య సంక్రాంతి బరిలో దిగితే ఎన్టీఆర్ రేసు నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్టుగా వార్తలు వినిపించాయి. అయితే ఈ గాసిప్స్‌కు ఫుల్ స్టాప్ పెట్టేసింది 'నాన్నకు ప్రేమతో' టీం.
ముందుగా అనుకున్నట్టుగానే పొంగల్ రేసులో దిగుతున్నట్టుగా ప్రకటించేశాడు ఎన్టీఆర్. దీపావళి సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్స్‌లో పొంగల్ రిలీజ్ అన్న లైన్‌తో బాబాయ్‌తో ఢీ కోడుతున్నట్టుగా తేల్చేశాడు. అయితే పొంగల్ సీజన్ జనవరి నెల అంతా ఉంటుంది కాబట్టి, కనీసం నందమూరి హీరోల రెండు సినిమాలు, రెండు వారాల గ్యాప్‌తో రిలీజ్ అయితే బాగుంటుందని భావిస్తున్నారు అభిమానులు.
Wishing everyone a HAPPY and a safe DIWALI #NannakuPrematho pic.twitter.com/ZbVbQeYGpm
— tarakaram n (@tarak9999) November 10, 2015