సినిమా థియేటర్ల పరిశీలన
నాగర్కర్నూల్రూరల్: పట్టణంలోని శ్రీపూర్ రోడ్డులో ఉన్న రవి, రమణ థియేటర్లను తెలంగాణ పొల్యూషన్ బోర్డు సభ్యులు మంగళవారం పరిశీలించారు. థియేటర్లతో చుట్టుపక్కల నివాస ప్రాంతాల ప్రజలకు ఇబ్బందికరంగా ఉందని గత కొంతకాలంగా పొల్యూషన్ బోర్డుకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అనంతరం కోర్టులో దావా చేయడంతో కోర్టు సూచనల మేరకు అధికారులు పరిశీలించారు. టాకీస్ నుంచి లోపల, బయట వెలువడుతున్న శబ్ద తరంగాలను ప్రత్యేక మానిటర్తో పరిశీలించారు. చట్టవిరుద్ధంగా పొల్యూషన్ ఉన్నట్లు తమ పరిశీలనలో తేలితే థియేటర్ యజమానులపై చర్య తీసుకుంటామని వారు పేర్కొన్నారు.