మరింత భద్రంగా వైద్య పరికరాలు..
పాలీ మెడిక్యూర్ వైస్ ప్రెసిడెంట్ హేమంత్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రోగులు, ఆసుపత్రుల సిబ్బందిని దృష్టిలో పెట్టుకుని మరింత భద్రంగా వైద్య పరికరాలు, డిస్పోజబుల్స్‌ను రూపొందిస్తున్నట్టు పాలీ మెడిక్యూర్ తెలిపింది. క్యాన్సర్‌కు దారితీసే డీఈహెచ్‌పీ, పీవీసీ లేకుండా ఐవీ కాన్యులా, ఐవీ సెట్స్, క్యాథెటర్స్ వంటి ఉత్పత్తులను తయారు చేస్తున్నామని కంపెనీ మార్కెటింగ్, సేల్స్ వైస్ ప్రెసిడెంట్ హేమంత్ భల్లా శుక్రవారం చెప్పారు. హైదరాబాద్ మార్కెట్లో పలు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టిన సందర్భంగా రీజినల్ బిజినెస్ సీనియర్ మేనేజర్ అరవింద్ కుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. 100కుపైగా ఉత్పత్తులను భారత్‌తోసహా 90 దేశాల్లో విక్రయిస్తున్నట్టు తెలిపారు. రూ.400 కోట్ల కంపెనీ ఆదాయంలో ఎగుమతుల వాటా 70 శాతమని వివరించారు.