poor man
-
ధర్మానికి లోబడడమే ధైర్యం
ధైర్యవంతులే జీవితంలో ఏదో ఒకటి సాధిస్తారు. కాని ధైర్యంగా కార్యాలు తలపెట్టడమంటే ప్రమాదాలను ఆహ్వానించడమే! అయినప్పటికీ వెరపకుండా ధర్మానికి లోబడి ముందుకు వెళుతూ ఉంటే విజయం వెన్నంటి నడుస్తుంది. ఒక ఊరిలో ఓ నిరుపేద కూలీ ఉండేవాడు. జీవితంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. అనేక ఎదురుదెబ్బలు తిన్నాడు. ఎన్నోకష్టాలు భరించాడు. అయినా ఏనాడూ కుంగిపోలేదు. ఎప్పుడూ సంతోషంగా, హాయిగా, నవ్వుతూ ఉండేవాడు. చూసేవాళ్లకు చాలా ఆశ్చర్యం వేసేది. ఇన్నిన్ని బాధలు భరిస్తూ కూడా ఇంత హాయిగా ఎలా ఉండగలుగుతున్నావూ.. అని అతడిని అడిగేవారు. దానికతను ‘‘అల్లాహ్ ఏ ప్రాణి పైనా దాని శక్తికి మించిన బాధ్యత మోపడు. మనం వద్దని అనుకున్నంత మాత్రాన రానున్నవి రాకమానతాయా? ఇదొక్కటి తెలుసుకుంటే చాలు’’ అని చిరునవ్వుతో సమాధానం చెప్పేవాడు.అందుకే, కష్టాల కరవాలం దూసుకొస్తున్నప్పుడు ధైర్యంగా, ఒడుపుగా దాని పిడిని పట్టుకోవాలంటారు పెద్దలు. అలా కాకుండా భయపడుతూ, బెదురుతూ పట్టుకోబోతే పిడివైపుకు బదులు మరో భాగం చేతికి దొరికి గాయాలు కావచ్చు. ప్రమాదం ఏర్పడవచ్చు. ధైర్యసాహసాలు కూడా సరైన విధంగా, యుక్తిగా ప్రయోగిస్తేనే చక్కని సాధనంగా ఉపకరిస్తాయి. కష్టాలకు, కన్నీళ్లకు బెదిరిపోకుండా నిలకడను, శక్తిని ప్రసాదిస్తాయి. భయం, పిరికితనం అన్నవి మనిషిని జీవచ్ఛవంగా మారుస్తాయి. ఉత్సాహం నీరుగారి పోతుంది. ధైర్యసాహసాలంటే మరేమిటోకాదు. మనిషి ధర్మానికి కట్టుబడి జీవించడం. తన విధి, బాధ్యతలను విలువైనవిగా గుర్తించడం. ఏదీ సాధించలేకపోవడానికి, ఏదో ఒకటి సాధించడానికి మధ్యన ఉన్న బేధమే ధైర్యం. మనిషికి అటువంటి తర్ఫీదునిచ్చి ధర్మానికి బద్ధునిగా చేస్తుంది రమజాన్ – మదీహా -
పేదోడి పెద్ద మనసు
-
నిరుపేదను ఆదుకోరూ..!
భూదాన్‌పోచంపల్లి(భువనగిరి) : కలిసిరాని వ్యాపారంతో ఆర్థిక పరిస్థితులు కుంగదీశాయి.. మరోవైపు వెంటాడిన అప్పులు చేనేత కార్మికుడి గుండె ఆగేలా చేశాయి. ఇంటి యజమాని చనిపోవడంతో ఇద్దరు పిల్లల భవిష్యత్ కళ్లముందు కదలాడుతుంటే కడు దుఃఖంతో బతుకీడుతున్న చేనేత కార్మికురాలి ధీనగాథ ఇది.. మండలకేంద్రానికి చెందిన చేనేత కార్మికుడైన జెల్ల కిరణ్(38) మగ్గం నేసి కుటుంబాన్ని పోషించుకునేది. ఆయనకు భార్య చందన, కుమార్తె అనూష(11), అజయ్‌స్వామి(8) ఉన్నారు. గతంలో పోచంపల్లిలో చేనేత పరిశ్రమ సంక్షోభంలో ఉన్న సమయంలో నల్లగొండ జిల్లా చర్లపల్లికి వెళ్లి అక్కడ అప్పులు చేసి మరమగ్గాలపై తయారైన వస్త్రాన్ని బ్లీచింగ్ చేయడానికి అవసరమైన యంత్ర సామగ్రిని కొనుగోలు చేశాడు. కాని ఆ వ్యాపారం కలిసి రాక అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. తిరిగి గత ఏడాది పోచంపల్లికి వచ్చి భార్య, భర్తలు కలిసి కూలీ మగ్గం నేస్తూ పొట్టపోసుకుంటున్నారు. వేధించిన అప్పులు.. అప్పులు ఇచ్చిన వారి నుంచి ఇటీవల వేధింపులు ఎక్కువయ్యాయి. అప్పులు ఇచ్చిన వారు ఇతనిపై చేయి కూడా చేసుకున్నారు. దాంతో తీవ్ర మనోవ్యధకు గురైన జెల్ల కిరణ్ ఈ నెల 3న ఇంట్లో మగ్గం నేస్తూనే గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. దయనీయస్థితిలో అంతిమ సంస్కారాలు... ఇతనికి సొంత ఇల్లు లేదు. మండల కేంద్రంలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. సదరు ఇంటి యజమాని మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకురావొద్దని చెప్పడంతో రెండు గంటల పాటు రోడ్డుపైనే శవాన్ని ఉంచారు. చివరకు బంధువులకు చెందిన ఖాళీ స్థలంలో టెంట్‌వేసుకొని అక్కడే చాలా ధీనస్థితిలో అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేసుకున్నారు. దహన సంస్కారాలైతే పూర్తయ్యాయి కాని, ఆ తరువాత తాను, పిల్లలతో ఎక్కడ ఉండాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. చివరకు మండల కేంద్రానికి చెందిన కర్నాటి బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి, తమ కేవీటీ స్టోర్ట్స్ క్లబ్ భవనంలో తాత్కాలికంగా తలదాచుకోవడానికి చోటు ఇచ్చాడు. వెక్కిరిస్తున్న కడు పేదరికం, భర్త మరణం, పిల్లల భవిష్యత్ వీటినంటిని దిగమింగుకొంటుంది చందన. అయితే కొందరు దాతలు ముందుకు వచ్చి బియ్యం, సరుకులు, నగదు రూపంలో సహాయాన్ని అందజేశారు. నిరుపేద జెల్ల చందన కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు చేనేత నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎవరైనా దాతలు ఆపన్నహస్తం అందించాలంటే ఎస్బీఐ బ్యాంకు ఖాతా నంబర్ (నల్లగొండ మైత్రి ఉమెన్స్ కాలేజ్ బ్రాంచ్)62296665320 ఆర్థిక సహాయాన్ని అందించాలని బాధితురాలు వేడుకుంటుంది. -
మరొకరి జీవితాన్ని నాశనం చేస్తావా?
న్యూఢిల్లీ: పేదరికంలో ఉండగా పెళ్లి చేసుకుని మరొకరి జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారని ఓ న్యాయస్థానం పిటిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్థికంగా దెబ్బ తిన్నందున తన మాజీ భార్యకు నెలకు రూ.7,500 జీవన భృతి చెల్లించలేనని ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించిన ధర్మాసనం పై విధంగా స్పందించింది. మాజీ భార్యకు జీవన భృతిని చెల్లించాల్సిందేనని దిగువ కోర్టు 2015లో ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ అదనపు సెషన్స్ జడ్జీ ఆదేశించారు. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో తాను పేదవానిగా పేర్కొన్న పిటిషనర్.. పెళ్లెలా చేసుకున్నాడని ప్రశ్నించారు.