మరొకరి జీవితాన్ని నాశనం చేస్తావా?
న్యూఢిల్లీ: పేదరికంలో ఉండగా పెళ్లి చేసుకుని మరొకరి జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారని ఓ న్యాయస్థానం పిటిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్థికంగా దెబ్బ తిన్నందున తన మాజీ భార్యకు నెలకు రూ.7,500 జీవన భృతి చెల్లించలేనని ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించిన ధర్మాసనం పై విధంగా స్పందించింది.
మాజీ భార్యకు జీవన భృతిని చెల్లించాల్సిందేనని దిగువ కోర్టు 2015లో ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ అదనపు సెషన్స్ జడ్జీ ఆదేశించారు. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో తాను పేదవానిగా పేర్కొన్న పిటిషనర్.. పెళ్లెలా చేసుకున్నాడని ప్రశ్నించారు.