portfolios announced
-
కొలువుదీరిన మంత్రివర్గం: సీఎం చేతిలో 13 శాఖలు
సాక్షి, చెన్నై: రెండు నెలల అనంతరం పుదుచ్చేరి మంత్రి వర్గం శాఖల కేటాయింపుతో పూర్తి స్థాయిలో కొలువుదీరింది. ఐదుగురు మంత్రులకు సీఎం రంగస్వామి ఆదివారం శాఖల్ని కేటాయించారు. గత నెల 27న బీజేపీకి చెందిన ఇద్దరు, ఎన్ఆర్ కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, వీరికి శాఖల కేటాయింపుల్లో జాప్యం తప్పలేదు. ముఖ్యశాఖలపై బీజేపీ కన్నేయడంతోనే ఈ జాప్యం నెలకొంది. ఎట్టకేలకు శాఖల కేటాయింపు ప్రక్రియను సీఎం రంగస్వామి ఎల్జీ తమిళిసై సౌందరరాజన్ ఆమోదంతో ముగించారు. సీఎం రంగస్వామి చేతిలో సాధారణ, స్థానిక పాలన, ఆరోగ్యం, దేవదాయ, హార్బర్, సైన్స్ అండ్ టెక్నాలజీ సహా 13 శాఖలు ఉన్నాయి. బీజేపీ మంత్రి నమశ్శివాయంకు హోం, విద్యుత్, పరిశ్రమలు, విద్య, క్రీడలు సహా ఆరు శాఖలు కేటాయించారు. మరో బీజేపీ మంత్రి సాయి జె శరవణకుమార్‌కు పౌరసరఫరాలు, డీఆర్డీఏ, అగ్ని మాపక, మైనారిటీ వ్యవహారాలు సహా ఆరు శాఖలు అప్పగించారు. ఇక, ఎన్ఆర్ కాంగ్రెస్ మంత్రులు లక్ష్మీనారాయణన్‌కు ప్రజాపనులు, పర్యాటకం, మత్స్య, న్యాయ, సమాచార శాఖలు, తేని జయకుమార్‌కు వ్యవసాయం, అటవీ, సాంఘిక సంక్షేమ, వెనుకబడిన సామాజిక వర్గం, మహిళా, శిశు సంక్షేమ శాఖలు, చంద్ర ప్రియాంకాకు రవాణా, ఆది ద్రావిడ, గృహ నిర్మాణ, సాంస్కృతిక శాఖ లను కేటాయించారు. -
మహా క్యాబినెట్ : శివసేనకు హోం శాఖ
సాక్షి, ముంబై : మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి సర్కార్ మంత్రులకు శాఖల కేటాయింపుపై కసరత్తును కొలిక్కితెచ్చింది. కీలక హోంశాఖ శివసేనకు చెందిన ఏక్నాథ్ షిండేకు దక్కనుంది. ఎన్సీపీ నేత ఛగన్ భుజబల్‌కు గ్రామీణాభివృద్ధి, సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ కేటాయిస్తారు. బాలాసాహెబ్ థొరట్ (కాంగ్రెస్)కు రెవెన్యూ శాఖ, జయంతి పాటిల్ (ఎన్సీపీ) ఆర్థిక శాఖ, సుభాష్ దేశాయ్ (శివసేన) పరిశ్రమలు, నితిన్ రౌత్‌కు (కాంగ్రెస్) ప్రజా పనుల శాఖను కేటాయించనున్నారు. మూడు పార్టీలకు సమ ప్రాధాన్యం దక్కేలా శాఖల కూర్పును చేపట్టారు. శివసేనకు హో మంత్రిత్వ శాఖ, ఎన్సీపీకి ఆర్థిక శాఖ, కాంగ్రెస్‌కు రెవెన్యూ శాఖ కేటాయించడం ద్వారా మూడు పార్టీలక ప్రాధాన్యం కలిగిన శాఖలను కేటాయించారు. మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేసిన రెండు వారాల తర్వాత శాఖల కేటాయింపుపై కసరత్తు ప్రక్రియ కొలిక్కివచ్చింది. -
ఆ ముగ్గురికి కీలక శాఖలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ తన క్యాబినెట్లో మంత్రులకు శాఖలను కేటాయించారు. నెంబర్ టూగా వ్యవహరిస్తున్న అమిత్ షాకు హోంశాఖను కేటాయించారు. కీలక ఆర్థిక శాఖను నిర్మలా సీతారామన్‌కు కట్టబెట్టారు. ఇక రాజ్‌నాథ్ సింగ్‌కు రక్షణ మంత్రిత్వ శాఖను కేటాయించారు. గత మోదీ క్యాబినెట్లో ఆర్థిక మంత్రిత్వ శాఖను నిర్వహించిన అరుణ్ జైట్లీ అనారోగ్య కారణంతో మంత్రి పదవిని చేపట్టలేనని ప్రధానికి స్పష్టం చేసిన నేపథ్యంలో నిర్మలా సీతారామన్‌కు ఆర్థిక శాఖను అప్పగించారు. ఇందిరా గాంధీ తర్వాత ఆమే.. ఇందిరా గాంధీ తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ నిర్మలా సీతారామన్ కావడం గమనార్హం. 1969-70ల్లో కొద్ది కాలం ఇందిరా గాంధీ ఆర్థిక మంత్రిత్వ శాఖనూ చేపట్టారు. ఇక 2017లో మోదీ క్యాబినెట్లో కేంద్ర రక్షణశాఖ మంత్రిగా ఆమె బాధ్యతలు తీసుకున్నారు. దేశ రక్షణశాఖను నిర్వహించిన తొలి మహిళాగా ఖ్యాతికెక్కారు నిర్మలాసీతారామన్. ఆ శాఖ బాధ్యతలను ఏడాదిన్నరపాటు నిష్కళంకంగా.. సమర్థంగా నిర్వహిస్తూ మోదీ ప్రశంసలు అందుకున్నారు. రఫేల్ ఒప్పందంపై ప్రతిపక్షనేత రాహూల్‌గాంధీ తీవ్రస్థాయిలో బీజేపీ సర్కారుపై విరుచుకుపడ్డ సందర్భంలో నిర్మలాసీతారామన్ పార్లమెంటులో మోదీకి వెన్నుదన్నుగా తన వాణిని వినిపించారు. కశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు మన జవానులను మట్టుపెట్టిన తరువాత, పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు నేపథ్యంలో నిర్మలాసీతారామన్ పనితీరుపై ప్రశంసలు వచ్చాయి అమిత్ షాకు అందలం బీజేపీ చీఫ్‌గా లోక్‌సభ ఎన్నికల్లో మోదీతో పాటు పార్టీ అఖండ విజయానికి బాటలు పరిచిన అమిత్ షా తొలిసారిగా కేంద్ర మంత్రివర్గంలో అడుగుపెట్టారు. పార్టీ అధ్యక్షుడిగా పలు రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేయడంతో పాటు ట్రబుల్ షూటర్‌గానూ ఆయన పేరొందారు. బీజేపీ ఉనికిలేని రాష్ట్రాల్లోనూ పార్టీ విస్తరణకు వ్యూహాలకు పదునుపెట్టడంలో అమిత్ షా ఆరితేరారు. మోదీకి అత్యంత సన్నిహితుడైన అమిత్ షా గతంలో మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో ఆ రాష్ట్ర హోంమంత్రిగా పనిచేశారు. ఒకానొక దశలో అమిత్ షా గుజరాత్ మంత్రిగా పలు పోర్ట్పోలియాలను నిర్వహించారు. స్టాక్ మార్కెట్ బ్రోకర్ నుంచి అంచెలంచెలుగా ఆయన అత్యున్నత స్ధాయికి చేరుకున్నారు. విధేయతకు పట్టం ఇక రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు గత క్యాబినెట్లో హోంశాఖను సమర్ధంగా నిర్వహించిన అనుభవం ఉంది. సీనియర్ మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్ ప్రధాని మోదీ సన్నిహితుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. గతంలో యూపీ ముఖ్యమంత్రిగా, బీజేపీ చీఫ్‌గానూ వ్యవహరించిన రాజ్‌నాథ్ సింగ్‌కు పార్టీ దిగ్గజ నేతలతో పాటు ఆరెస్సెస్ అగ్ర నేతలతోనూ విస్తృత పరిచయాలున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ విజయతీరాలకు చేరాలంటే మోదీ నాయకత్వం అవసరమంటూ ఎల్కే అద్వాణీ సహా పార్టీ కురువృద్ధులను ఒప్పించడంలో రాజ్‌నాథ్ కీలక పాత్ర పోషించారు. -
ముఖ్యమంత్రి వద్దే హోం, ఆర్థిక శాఖలు!
శాంతిభద్రతల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని విమర్శలు వస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత కీలకమైన హోం, ఆర్థిక మంత్రిత్వ శాఖలను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తనవద్దే ఉంచుకున్నారు. మొత్తం 44 మందితో కూడిన మంత్రివర్గాన్ని ఆయన ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రులు ఇద్దరికీ కూడా కీలకమైన శాఖలే ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యకు ప్రజా పనుల శాఖ, మరో డిప్యూటీ సీఎం దినేష్ శర్మకు పార్లమెంటరీ వ్యవహారాలు, ఉన్నత విద్యాశాఖలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో దాదాపు 24 ఏళ్ల పాటు ఉండి, ఎన్నికలకు కొంతకాలం ముందే బీజేపీలోకి వచ్చిన రీటా బహుగుణ జోషి, మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మనవడు సిద్దార్థ నాథ్ సింగ్ లాంటి పెద్దవాళ్లకు కూడా మంత్రిపదవులు లభించాయి. ఇప్పటివరకు తెలిసిన శాఖలు యోగి ఆదిత్యనాథ్: ముఖ్యమంత్రి, హోం శాఖ, ఆర్థిక శాఖ కేశవ్ ప్రసాద్ మౌర్య: ప్రజాపనుల శాఖ దినేష్ శర్మ: పార్లమెంటరీ వ్యవహారాలు, ఉన్నత విద్య చేతన్ చౌహాన్: క్రీడా శాఖ అశుతోష్ టాండన్: ప్రాథమిక విద్యాశాఖ రీటా బహుగుణ జోషి: సెకండరీ విద్యాశాఖ మొహసిన్ రజా: మైనారిటీ వ్యవహారాలు స్వామి ప్రసాద్ మౌర్య: వ్యవసాయ శాఖ