మూసీలో యువకుడి గల్లంతు.. గాలింపు
మోత్కూరు(నల్గొండ జిల్లా): మోత్కూరు మండలం పొడిచేడు వద్ద మూసీ నదిలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఆదివారం సాయంత్రం మూసీ నదిలో ఈత కొడుతుండగా మునిగిపోయాడు.
యువకుడు మోత్కూరు మండలం బాసారం గ్రామానికి చెందిన పొట్టపాక ఉపేందర్(25)గా గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.