కోసిగి పోలీసుకు రాష్ట్రస్థాయి పురస్కారం
కోసిగి: స్థానిక పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ మధుకుమార్ రాష్ట్ర స్థాయి పౌర సేవా పురస్కార్ అందుకున్నారు. సోమవారం విజయవాడలో డీజీపీ సాంబశివరావు ఈ అవార్డు ప్రదానం చేశారు. మధుకుమార్ శ్రీశైలంలో జరిగిన కృష్ణా పుష్కరాల్లో విధులు నిర్వహించారు. అక్కడకి వచ్చే వెళ్లే భక్తులకు ఉత్తమ సేవలు అందించారు. ఆయన సేవలకు గుర్తుగా రాష్ట్ర స్థాయిలో ప్రథమ సేవా అవార్డును అందుకున్నారు. ఎమ్మిగనూరుకు చెందిన కాశీమప్ప, గోవిందమ్మల కుమారుడైన ఇతను..2007లో కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించాడు. రాష్ట్ర స్థాయి అవార్డు అందుకున్న మధుకుమార్ను కోసిగి ఎస్ఐ ఇంతియాజ్ బాషాతో పాటు తోటి కానిస్టేబుళ్లు అభినందించారు. అవార్డు వచ్చేందుకు ప్రోత్సాహం అందించిన జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ, డీఎస్పీ కొల్లి శ్రీనివాసులు, ఇన్చార్జ్ సీఐ దైవప్రసాద్, బదిలీ పై వెళ్లిన బేతంచర్ల సీఐ కంబగిరి రాముడికి మధుకుమార్ కృతజ్ఞతలు తెలిపారు.