The poverty line
-
తెల్లకార్డులకు కత్తెర
ప్రస్తుతం 85 శాతం మందికే సరుకులు ఆహార భద్రతా చట్టం ప్రకారం 67 శాతం మందికే అంటున్న కేంద్రం మిగిలిన 18 శాతం మందికి ఎగనామం జిల్లాలో 3.2 లక్షల కార్డుల తొలగింపునకు సన్నాహాలు దరఖాస్తు చేసుకున్నా కొత్త కార్డులు ఇక లేనట్టే అయోమయంలో పేదలు తెల్ల రేషన్‌కార్డులకు కోతపెట్టేందకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ తాజా ప్రకటనలను సాకుగా చూపి కొత్తకార్డుల జారీకి మంగళం పాడేందుకు రెడీ అయిపోయింది. మరో సారి సర్వేల పేరుతో ఉన్నకార్డులను ఊడబెరికి పచ్చచొక్కాలోళ్లకు కట్టబెట్టేందుకు సమాయత్తమైంది. చిత్తూరు:కేంద్ర ప్రభుత్వ నిర్ణయం దారిద్య్రరేఖకు దిగువునున్న తెల్ల రేషన్కార్డుదారులైన పేదలకు శాపంగా మారింది. 67 శాతం మందికి జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని వర్తింపచేస్తామని తాజాగా ప్రకటించింది. దీన్ని సాకుగా చూపి రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో పెద్ద ఎత్తున తెల్లరేషన్‌కార్డుల తొలగించేందుకు సమాయ త్త మవుతోంది. ఇప్పటివరకు జిల్లా జనాభాలో 85 శాతం మందికి తెల్లరేషన్ కార్డుల ద్వారా నిత్యావసర సరుకులు సరఫరా చేస్తున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కేంద్రం తాజా గా ప్రకటించినట్లు 67 శాతం మందికి మాత్రమే ఆహార భద్రత చట్టం వర్తింపజేసే పక్షంలో మిగిలిన 18 శాతం మంది పేదలు ఆహారభద్రత కోల్పోతారు. వారికి నిత్యావసర సరుకులు అందే పరిస్థితి లేదు. ప్రస్తుతం జిల్లాలో 10,39,953 నివాస గృహాలు ఉండగా 41,74,064 వేల జనాభా ఉన్నారు. వీరిలో 9,80,888 కుటుంబాలకు తెల్లరేషన్‌కార్డులున్నాయి. 1,34,162 కుటుంబాలకు చక్కెర కార్డులున్నాయి. వీరుగాక మరో 1,17,524 మంది కొత్తగా తెల్లరేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా వీరిలో 1,06,811 మంది తెల్లరేషన్‌కార్డులకు అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. కానీ రేషన్‌కార్డులు మంజూరు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం 67 శాతం మందికి మాత్రమే జాతీయ ఆహార భద్రతా చట్టం కింద సరుకులు పంపిణీ చేస్తామని తేల్చి చెప్పిన నేపథ్యంలో మిగిలిన 18 శాతం మందిని ఆహార భద్రతా చట్టం నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లెక్కన ప్రస్తుతమున్న 9,80,888 తెల్లరేషన్‌కార్డుల్లో 6,57,195 (67 శాతం) తెల్లకార్డులను మాత్రమే ఉంచి, మిగిలిన 3,23,693 (18శాతం) తెల్లరేషన్‌కార్డులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. గుత్తమొత్తంగా అన్ని కార్డులను ఒకేసారి తొలగి స్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న ఆలోచనతో మరోమారు బోగస్ కార్డుల ఏరివేత సాకుతో తెల్లకార్డులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. తెల్లరేషన్‌కార్డుల పంపిణీకి ప్రభుత్వం మంగళం పాడినట్లే. కార్డుల కోసం ఎదురుచూస్తున్న 1,17,524 మంది పేదలకు కార్డులు అందే అవకాశం లేనట్టేనని సమాచారం. తెలుగు తమ్ముళ్లకే తెల్లకార్డులు కేంద్ర ఆహారభద్రతా చట్టం సాకుతో రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ నాయకులు చెప్పి వారికి మినహా మిగిలిన వారి తెల్లకార్డులన్నింటినీ తొలగించేందుకు అధికార పార్టీ సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే జన్మభూమి కమిటీల మాటున అర్హులైన పేదల కార్డులను ఏకపక్షంగా తొలగిస్తున్న అధికార పార్టీ నేతలు కేంద్రం తాజా ఉత్తర్వులను అనువుగా చేసుకు పెద్ద ఎత్తున అర్హుల రేషన్‌కార్డులను తొలగించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ప్రత్యేకించి వైఎస్సార్సీపీ సానుభూతిపరుల తెల్లకార్డుల తొలగింపే ధ్యేయంగా తెలుగు దేశం నేతలు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
భద్రతా కార్డుల పరిశీలన మళ్లీ మొదటికి!
పరిగణనలోకి నూతన ఆదాయ, భూపరిమితి పెంపు * ఆహార భద్రతా కార్డుల జారీపై కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు * 48 లక్షల దరఖాస్తులకూ తప్పని పునఃపరిశీలన * డిసెంబర్ 15 నాటికి పూర్తి చే యాలని ప్రభుత్వ నిర్ణయం * జనవరి 15 తరువాతే కార్డుల జారీ సాధ్యమంటున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అందజేయనున్న ఆహార భద్రతా కార్డు (ఎఫ్ఎస్సీ) దరఖాస్తుల పరిశీలన మళ్లీ మొదటికొచ్చింది. రేషన్‌కార్డు పొందేందుకు ఉన్న ఆదాయ, భూపరిమితిని పెంచిన నేపథ్యంలో అందుకనుగుణంగా ఆహారకార్డుల లబ్ధిదారుల ఎంపిక పరిశీలన జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై జిల్లా కలెక్టర్లకు తాజాగా మార్గదర్శకాలను సైతం జారీ చేసింది. దీంతో మొత్తం 96 లక్షల దరఖాస్తుల్లో ఇప్పటివరకు పూర్తిచేసిన 48 లక్షల దరఖాస్తుల పునఃపరిశీలన అనివార్యంగా మారింది. ఇప్పటికే పింఛన్ దరఖాస్తుల పరిశీలనలో ఊపిరిసలపని క్షేత్రస్థాయి అధికారులకు డిసెంబర్ 15 నాటికి భద్రతాకార్డుల పరిశీలనా పూర్తిచేయాలని ప్రభుత్వం విధించిన గడువు తలకుమించిన భారంగా మారనుంది. ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కొత్తగా ఇచ్చిన మార్గదర్శకాల మేరకు దరఖాస్తుల పరిశీలన జరపాలని ప్రభుత్వం సూచించింది. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో 90 శాతం, వరంగల్, మెదక్, మహబూబ్‌నగర్, కరీంగనర్ జిల్లాల్లో 50 శాతానికి పైగా దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. ఒక్క అనర్హుడికి కార్డు ఇచ్చినా కఠిన చర్యలు తప్పవని ఓ పక్క ప్రభుత్వం హెచ్చరిస్తున్న తరుణంలో కొత్త మార్గదర్శకాల మేరకు కచ్చితంగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన జరపాల్సి ఉంటుందని, పనిభారం రెండింతలు అవుతుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. డిసెంబర్ 15 నుంచి సాధ్యమేనా..? ఇదిలా ఉండగా వచ్చేనెల 15 నుంచి లబ్ధిదారులకు ఆహార భద్రతా కార్డులను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే నిర్ణీత గడువులో ఇప్పటికే పరిశీలన చేసిన కార్డులతో పాటు అదనపు 50 లక్షల కార్డులను ఈ సమయంలోగా పూర్తి చేయడం సాధ్యమేనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పరిశీలన కొంత చురుగ్గా సాగినా, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ వంటి పట్టణాల్లో నిర్ణీత గడువులోగా పూర్తి చేయడం కష్టమేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న కార్డుల సంఖ్యను బట్టి జనవరి రెండోవారానికి గానీ కొత్త కార్డుల జారీ సాధ్యమని స్పష్టం చేస్తున్నాయి. -
ఆపరేషన్
కలెక్టరేట్: బోగస్ రేషన్ కార్డులకు ఇక చెక్ పడనుందా? దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం చౌకధరల దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులను రాయితీపై అందిస్తుంది. ఇందుకోసం జిల్లాలో దాదాపు 1,332 చౌకధరల దుకాణాలు. తెలుపు, అంత్యోదయ, అన్నపూర్ణ ఇతర కార్డులు కలిపి దాదాపు ఏడు లక్షలకు పైగా ఉన్నాయి. వీటిలో సుమారు లక్ష వరకు బోగస్ కార్డులు ఉన్నట్లు అధికారు లు అంచనా వేశారు. జరగని కార్డుల విభజన జిల్లాలో రేషన్ దుకాణాల సంఖ్య పెరుగుతున్నా, కార్డుల విభజనకు మాత్రం రాజకీ య గ్రహణం చుట్టుకుంది. కార్టుల విభజ న ఎప్పుడు మెదలు పెట్టినా రాజకీయ ఒత్తి డి కారణంగా మధ్యలోనే నిలిచిపోతోంది. 2008, 2009లో ఈ ప్రక్రియను మొదలు పెట్టిన అధికారులు ఓ బడానేత, యూని యన్ నాయకుల ఒత్తిడి మేరకు మధ్యలోనే నిలిపివేశారు. దీంతో కార్డులు తక్కువగా ఉన్న రేషన్ దుకాణాల వారికి నష్టం తప్పలేదు. నగరంలో ఇలా జిల్లా కేంద్రంలో 87 రేషన్ షాపులు ఉన్నాయి. ఇందు లో దాదాపు 25 దుకాణాల పరిధిలోనే వెయ్యి నుంచి ఐదు వేల కార్డుల వరకు ఉన్నట్లు తెలిసింది. వాస్తవానికి పౌరసరఫరాల కమిషనర్ నిబంధనల మేరకు ఒక్కో రేషన్ షాపులో, మున్సిపాలిటీ పరిధి అయితే 600 నుంచి 650, గ్రామీణ, మండల పరిధి అయితే 400 నుంచి 450 కార్డులు మాత్రమే ఉండాలి. నగరం లో చాలా దుకాణాలలో బోగస్ కార్డులతోపాటు, నిబంధనలకు మించిన కార్డులు ఉన్నాయి. రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ, రీ సైక్లింగ్ చేస్తూ అడ్డం గా దొరకిపోయిన సంఘటనలు ఇటీవల జిల్లాలో వెలుగు చూశాయి. అవి కూడా నిజామాబాద్ నగరానికి సంబంధించిన రేషన్ డీలర్ల బియ్యమే అని అధికారులు కూడా తేల్చారు. దీనిపై సీరియస్‌గా స్పం దించిన జేసీ, కమిషనర్‌కు లేఖ రాశారు. వెంటనే కార్డుల విభజన మొదలు పెట్టాలని, బోగస్ కార్డులను ఏరివేసి అర్హులకు కార్డులు అందించాలని అధికారులను ఆదేశించారు. పనిలో పనిగా ఎలాగూ ప్రస్తుతం కార్డులపై ‘డబ్ల్యూఏపీ’ అక్షరాలను తొలగించి, ఆ స్థానంలో డబ్ల్యూటీఎస్ను చేరుస్తున్నారు. పనిలో పనిగా కార్డుల విభజన చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. జిల్లాలో 62 వేల పాత గులాబీ కార్డులు, 40 వేల పింఛన్‌దారులు, మిగతా రెగ్యులర్ ఉద్యోగులతో పాటు మినిమం టైం స్కేల్ ఉద్యోగులను కలుపుకొని దాదాపు 30 వేల మంది, ఏపీఎల్ కుటుంబానికి చెందిన వారు మరో 25 వేల మంది వరకు ఉంటారు. ఇవన్నీ కలిపితే దాదాపు లక్షన్నర వరకు పింక్ కార్డులు ఉంటాయి. జిల్లాలో దాదాపు రెండు లక్షల వరకు కుటుంబాలు ఉంటాయి. కొన్ని కుటుంబాలలో లెక్కకు మించిన కార్డులు ఉన్నాయి. రేషన్ డీలర్లు మరో అడుగు ముం దుకేసి రచ్చబండలో ముందుగానే బినామీ పేర్లతో కార్డులు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఎక్కడ లేని విధంగా జిల్లాలో ఏడు లక్షల వరకు కార్డుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం నగరంలో 26 దుకాణాలు, జిల్లావ్యాప్తంగా మరో వంద రేషన్ షాపుల విభజనకు అధికారులు రంగం సిద్ధం చేశారు. దీంతో జిల్లావ్యాప్తం గా మరో 150 వరకు రేషన్ షాపులు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.