మహీంద్రా ‘బొలెరో’ కొత్త వేరియంట్
ప్రారంభ ధర రూ.6.59 లక్షలు
న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా(ఎం అండ్ ఎం) తాజాగా తన స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ ‘బొలెరో’లో కొత్త వేరియంట్ ‘పవర్ ప్లస్’ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.6.59 లక్షలు (ఎక్స్‌షోరూమ్ ముంబై)గా ఉంది. ‘బొలెరో పవర్ ప్లస్’లో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, డ్రైవర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, వాయిస్ మెసేజింగ్ వ్యవస్థ, ఫ్యూయెల్ సేవింగ్ మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఇందులో ఎంహక్ డీ70 ఇంజిన్‌ను అమర్చినట్లు పేర్కొం ది. దీంతో ఈ కొత్త వేరియంట్ ప్రస్తుత బొలెరో వాహనాల కన్నా 13 శాతం అధిక శక్తిని, 5 శాతం ఎక్కువ మైలేజ్‌ను ఇస్తుందని వివరించింది. ప్రస్తుత బొలెరో శ్రేణికి చెందిన వాహనాల ధర కన్నా కొత్త వేరియంట్ ధర రూ.1 లక్ష తక్కువ గా నిర్ణయించామని తెలిపింది.