తెలంగాణలో అధికారంలోకి వస్తాం
బీజేపీ నేత నర్సింహారావు
సాక్షి, హైదరాబాద్: రానున్న రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నర్సింహారావు అన్నారు. ఇప్పటి దాకా దేశంలో జరిగిన ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్ని తెలంగాణలోనూ అనుసరిస్తామని చెప్పా రు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, పార్టీనేతలు వేముల అశోక్, కృష్ణసాగర్‌రావు, సుధాకర్ శర్మతో కలసి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత మూడేళ్లలో అత్యధిక ప్రజాదరణ పొందిన నాయకుడు మోదీనేనని అంతర్జాతీయంగా సర్వే చేసిన సంస్థలు చెబుతున్నా యన్నారు.
ఎన్డీఏ ప్రభుత్వ పనితీరు బాగుందని దేశంలో 73శాతం మంది ప్రజలు అభిప్రాయప డుతున్నారన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యా మ్నాయం బీజేపీ మాత్రమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్రం వ్యవహరించే తీరు రాజ్యాంగ పరిధి, రాజ్యాంగ అవసరాలకు లోబడి ఉంటుందన్నారు. టీఆర్ఎస్తో బీజేపీ రాజకీయ పోరాటం చేస్తోంద న్నారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడును ప్రకటించటం దక్షిణాది రాష్ట్రాలకు గొప్ప గౌరవమన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై పాత కేసులను ప్రభుత్వం తిరగదోడుతోందని, ఇలాంటి రాజకీయ వేధింపులు సరికావన్నారు. రాజాసింగ్‌పై వేధింపులను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.