క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడు మృతి
దోహా: భారత్ కు చెందిన ఓ యువకుడు ఖతార్ లో క్రికెట్ ఆడుతూ గుండె పోటుతో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఖతార్ లో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్న కేరళకు చెందిన ప్రమోద్ థెరాయిల్(32) శుక్రవారం తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్న సమయంలో తీవ్రంగా ఛాతిలో నొప్పిరావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
దీంతో దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. గత సంవత్సరమే పెళ్లి చేసుకున్న ప్రమోద అకస్మికంగా మృతి చెందడంతో అతని స్నేహితుడొకరు ఆవేదన వ్యక్తం చేశాడు.