టైటిల్‌పోరుకు ప్రణీత్ సింగ్
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) టోర్నమెంట్లో హైదరాబాద్ కుర్రాడు ప్రణీత్‌సింగ్ భాటియా టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచాడు. సానియా మీర్జా టెన్నిస్ అకాడమీలో జరుగుతోన్న ఈ టోర్నీలో అండర్–12 బాలుర సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో ప్రణీత్ ఫైనల్‌కు చేరుకున్నాడు. గురువారం జరిగిన బాలుర సింగిల్స్ సెమీఫైనల్లో ప్రణీత్ 6–1, 6–1తో రామధనుశ్పై గెలుపొందాడు.
మరో సెమీస్‌లో ఎన్. అనిరుధ్ 6–2, 6–2తో వెంకట్ రిషిని ఓడించి తుదిపోరుకు అర్హత సాధించాడు. డబుల్స్ సెమీస్‌లో ప్రణీత్ – అర్నవ్ బిష్ణోయ్ జంట 6–1, 6–3తో ప్రత్యూష్ – రేయాన్ష్ రాజీవ్ జోడీపై నెగ్గి ఫైనల్‌కు చేరుకుంది. మరో సెమీస్‌లో వెంకట్ రిషి – అనిరుధ్ జోడీ 6–1, 6–1తో సంజిత్ – అనీశ్ శర్మ జంటపై గెలుపొందింది.