‘కోకాకోలా’ క్రికెట్ శిక్షణకు ప్రణీత్ రాజ్ ఎంపిక
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన సెయింట్ జోన్స్ కాలేజి విద్యార్థి ప్రణీత్ రాజ్ ముంబైలో నిర్వహించనున్న కోకాకోలా క్రికెట్ శిక్షణ శిబిరానికి ఎంపికయ్యాడు. క్రికెట్ ఇండియా అకాడమీ ఆధ్వర్యంలో ముంబైలోని ఎయిరిండియా మైదానంలో ఈ నెల 27 వరకు ఈ శిక్షణ శిబిరం కొనసాగనుంది.
ఇటీవల నిర్వహించిన అండర్-16 అంతర్ రాష్ట్ర కోకాకోలా క్రికెట్ కప్లో ప్రదర్శన ఆధారంగా శిక్షణ శిబిరానికి ఆటగాళ్ల ఎంపిక జరిగింది. మొత్తం 27 మంది ఆటగాళ్లను ఎంపిక చేసిన నిర్వాహకులు వీరిలో ప్రణీత్ రాజ్కూ చోటు కల్పించారు. శిక్షణ పూర్తయిన తరువాత ఈ నెల 27న వీరి నుంచి కోకాకోలా ఎలెవన్ జట్టును ఎంపిక చేస్తారు.