15న భారత్‌లోకి నోకియా ఆండ్రాయిడ్ ‘ఎక్స్’
న్యూఢిల్లీ: ఓపెన్ సోర్స్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంపై నోకియా తొలిసారిగా రూపొం దించిన ‘ఎక్స్’ స్మార్ట్‌ఫోన్ మార్చ్ 15 నుంచి భారత మార్కెట్లో లభ్యం కానుంది. దీని ధర రూ. 8,500. నాలుగు అంగుళాల టచ్ స్క్రీన్, డ్యూయల్ సిమ్, డ్యుయల్ కోర్ 1 గిగాహెట్జ్ ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్, 32 జీబీ దాకా ఎక్స్‌పాండబుల్ మెమరీ ఇందులో ప్రత్యేకతలు. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 3ఎంపీ రియర్ కెమెరా కూడా ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ రిటైల్ సంస్థ ది మొబైల్ స్టోర్‌లో ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
గత నెల 24 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ఓపెన్ సోర్స్ ఆండ్రాయిడ్ ఆధారిత ఎక్స్, ఎక్స్‌ప్లస్, ఎక్స్ఎల్ శ్రేణి స్మార్ట్ఫోన్లను నోకియా ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. రెండో త్రైమాసికంలో ఎక్స్‌ప్లస్, ఎక్స్ఎల్ (రేటు సుమారు రూ. 9,200)ను నోకియా ప్రవేశపెట్టనుంది. ఎక్స్ సిరీస్ ఫోన్లను పూర్తి ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై కాకుండా ఆండ్రాయిడ్ వేరియంట్‌తో పనిచేస్తాయి. ఓపెన్ సోర్స్ ఆండ్రాయిడ్, ఆశా, విండోస్ ఫోన్లలో ఫీచర్లను కలిపి వీటిని నోకియా తయారు చేస్తోంది.