దుమ్మురేపుతున్న కాటమరాయుడు బిజినెస్!
పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కాటమరాయుడు. తమిళ సూపర్ హిట్ చిత్రం 'వీరం' ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. టీజర్‌కు ఆల్‌టైమ్ రికార్డుస్థాయిలో ఆన్లైన్లో వ్యూస్ దక్కాయి. దీంతో సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి.
కాటమరాయుడు థియేటర్లకు వచ్చేందుకు సిద్ధమవుతుండటంతో ఈ సినిమా ప్రి-రిలీజ్ బిజినెస్ వివరాలు ఆసక్తిరేపుతున్నాయి. రికార్డుస్థాయిలో ఈ సినిమాకు ప్రి-రిలీజ్ బిజినెస్ చేసినట్టు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అధికారిక లెక్కలు తెలియకపోయినా.. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం కాటమరాయుడు మొత్తంగా వందకోట్లకుపైగా బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది. ఆ వర్గాలు చెప్తున్న వివరాల ప్రకారం ప్రాంతాలవారీగా కాటమరాయుడి ప్రిబిజినెస్ ఇలా ఉంది...
నిజాం: రూ.18 కోట్లు
సిడెడ్: రూ.11.70 కోట్లు
యూఏ: రూ8.10 కోట్లు
గుంటూరు: రూ.6 కోట్లు
ఈస్ట్: రూ. 5.85 కోట్లు
వెస్ట్: రూ. 4.60 కోట్లు
కృష్ణ: రూ. 4.60 కోట్లు
నెల్లూరు: రూ. 2.65 కోట్లు
కర్ణాటక + తమిళనాడు+ ఆర్వోఐ: రూ .9 కోట్లు
విదేశీ మార్కెట్: రూ 11.50 కోట్లు
మొత్తంగా థియేట్రికల్ బిజినెస్: రూ. 82 కోట్లు
కాగా.. శాటిలైట్ హక్కులు: రూ 12.50 కోట్లు
ఆడియో+ హిందీ డబ్ శాటిలైట్ + డిజిటల్: సుమారుగా రూ .7.5 కోట్లు
మొత్తంగా రూ. 102 కోట్లు