గూగుల్‌పై సీబీఐ విచారణ
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్‌పై సీబీఐ ప్రాథమిక విచారణ నమోదు చేసింది. 2013లో గూగుల్ పొందుపరిచిన మ్యాప్‌లను సీబీఐ నిశితంగా పరిశీలించనుంది. చట్టాలను అతిక్రమించి నిషేధిత ప్రాంతాలను మ్యాపింగ్ చేసినట్టు అభియోగాలు నమోదు చేసింది. భారత రక్షణ స్థావరాలు, ఇతర సున్నితమైన ప్రదేశాలను చిత్రీకరించినట్టు ఆరోపణలు వచ్చాయి.
భారత సర్వేయర్ జనరల్ కార్యాలయం ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించింది. గతేడాది మార్చిలో మ్యాపింగ్ పోటీలు నిర్వహించే ముందు భారత సర్వే కార్యాలయం అనుమతి తీసుకోలేదని తెలియజేసింది. పరిసర ప్రాంతాలు, ఆస్పత్రులు, రెస్టారెంట్ల వివరాలను మ్యాపింగ్ చేయాల్సిందిగా ప్రజలను కోరుతూ గూగుల్ పోటీలను నిర్వహించింది. అయితే ప్రజలకు సంబంధంలేని సున్నితమైన రక్షణ స్థావరాలను ఎలా మ్యాపింగ్ చేశారో తెలియజేయాల్సిందిగా సర్వే ఆఫ్ ఇండియా గూగుల్‌కు సూచించింది. గూగుల్ నిబంధనలను ఉల్లంఘించడాన్ని కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకెళ్లింది. హోం శాఖ ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు చేయనుంది.