premiste poye kalam
-
ప్రేమే జీవితం కాదు
లక్ష్యసాధన కోసం యువతరం పాటుపడాలని, మంచి కెరీర్ని ఎంచుకుని జీవితంలో స్థిరపడటానికి కృషి చేయాలనీ సందేశం ఇస్తూ, డి.ఇ. రాజు నిర్మించిన చిత్రం ‘ప్రేమిస్తే పోయే కాలం’. బి. రవిచంద్ర దర్శకుడు. ఇటీవలే షూటింగ్ పూర్తయ్యింది. ఈ నెలలోనే పాటలను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘జీవితంలో ప్రేమ ఒక భాగం మాత్రమేనని చెప్పే చిత్రం ఇది. ఈ సినిమాలో ఉన్న మదర్ సెంటిమెంట్ అందరి హృదయాలను హత్తుకుంటుంది. కార్తీక్ కొడకొండ్ల మంచి పాటలు స్వరపరిచారు. ఓ ప్రత్యేక పాటకు కన్నడ నటి కవిత నృత్యం చేశారు’’ అని చెప్పారు. -
ప్రేమిస్తే... పోయే కాలం
ప్రేమ అనేది జీవితంలో ఓ భాగం మాత్రమే. కానీ, అదే సర్వస్వం అనుకుని కెరీర్ని ప్లాన్ చేసుకోకుండా నేటి యువత సమయాన్ని వృథా చేసుకుంటున్నారనే కథాంశంతో డి.ఇ. రాజు నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమిస్తే పోయే కాలం’. రవిచంద్ర దర్శకుడు. చిత్రవిశేషాలను దర్శక, నిర్మాతలు తెలియజేస్తూ -‘‘తల్లి ప్రేమ, సోదర ప్రేమ, యువతీ యువకుల మధ్య ప్రేమ.. ఏ ప్రేమలో అయినా అతి తగదని చెప్పే సినిమా ఇది. జీవితంలో ఒక్క క్షణం గడిచిపోతే తిరిగి రాదని యువత తెలుసుకోవాలి. కెరీర్ని ప్లాన్ చేసుకోవాలనే సందేశం ఉంది’’ అని చెప్పారు.