వర్తమాన చరిత్రను చెప్పగలిగేది పద్యమే..
విశ్రాంతాచార్యులు
కోవెల సుప్రసన్నాచార్య
l ఘనంగా ‘నవశకం తెలంగాణ శకం’
ఆవిష్కరణ
హన్మకొండ కల్చరల్ : వర్తమాన చరిత్రను చెప్పగలిగే సమర్థత పద్యానికే ఉందని ఠాగూర్, గుర్రం జాషువా అవార్డు గ్రహీత విశ్రాంతాచార్యులు కోవెల సుప్రసన్నాచార్య అన్నారు.
జిల్లాకు చెందిన పద్య కవి, రచయిత వెలపాటి రాంరెడ్డి సహస్ర చంద్రదర్శనోత్సవం ఆదివా రం హన్మకొండలోని శ్రీరాజరాజనరేంద్రాంధ్రభాషానిలయంలో తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యాన ఏర్పాటుచేశారు. తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు పొట్లపల్లి శ్రీనివాస్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కోవెల సుప్రసన్నాచార్య ముఖ్యఅతి థిగా పాల్గొని రాంరెడ్డి వెలువరించిన ‘నవశకం తెలంగా ణ శకం’ పద్యకవితా సంపుటిని ఆవిష్కరించి మాట్లాడా రు. తన సుదీర్ఘ జీవనయానంలో రాంరెడ్డి స్వాతంత్య్ర సంగ్రామం, రజాకార్ల దాడులు, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలకు సాక్షిగా నిలిచార ని తెలిపారు. దీంతో ఆయన రచనల్లో చరిత్ర సజీవ సన్నివేశాలుగా కనిసిస్తుందన్నా రు. ఈ సమావేశంలో రామా చంద్రమౌళి, నమిలికొండ బాలకిషన్‌రావు, అనిశెట్టి రజిత, బిల్ల మహేందర్, కుం దావజ్జుల కృష్ణమూర్తి, డాక్టర్ వెన్నవరం ఈదారెడ్డి, డాక్టర్ పిట్టా సత్యనారాయణ తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా రాంరెడ్డి–యశోద దంపతులను సన్మానించారు. కార్యక్రమంలో రాంరెడ్డి కుటుంబ సభ్యులుమంద దీపిక–డాక్టర్ బుచ్చిరెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి– సంధ్య, హేమసుందర్‌రెడ్డి, అనుమాండ్ల నవీన్‌రెడ్డి, కాళోజీ ఫౌండేషన్ అధ్యక్ష, కార్యదర్శులు నాగిళ్ల రామశాస్త్రి, వీ.ఆర్.విద్యార్థి, సహృదయ అధ్యక్షుడు డాక్టర్ కే.ఎల్.వీ.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.